కొత్తగూడెం ఆర్టీసీ డిపోని సందర్శించిన కరీంనగర్ జోన్ ఈడి 

కొత్తగూడెం ఆర్టీసీ డిపోని సందర్శించిన కరీంనగర్ జోన్ ఈడి 

కొత్తగూడెం లోకల్ గైడ్:

కొత్తగూడెం ఆర్టీసీ డిపోని సోమవారం ఆర్టీసి కరీంనగర్ జోన్ ఎగ్జిక్యూటివ్  డైరెక్టర్ సోలోమన్  సందర్శించారు. డిపో మేనేజర్ దేవేందర్ గౌడ్, సిబ్బంది మొక్కను బహుకరించి శాలువాతో ఈడి సత్కరించారు. అనంతరం ఈడి నూతనంగా ఏర్పాటుచేసిన  డిస్పెన్సరీని పరిశీలించి, డిపోలో మొక్కను నాటారు. ఈడి సిబ్బందికి, పలు సూచనలు సలహాలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... మహాలక్ష్మి పథకాన్ని సిబ్బంది సహకారంతోనే విజయవంతగా కొనసాగిస్తున్నామన్నారు. బస్సులు లేక ప్రయాణికులకు ఇబ్బంది ఏర్పడితే, అధికారుల దృష్టికి తీసుకువచ్చి, ఆర్టీసీ అభివృద్ధికి తోడ్పడాలన్నారు.సిబ్బందికి, పలు సూచనలు సలహాలు చేశారు. సీసీ కెమెరాల సమస్యని ఈడి దృష్టికి లోకల్ గైడ్ ప్రతినిది తీసుకెళ్లగా.. అది క్రైమ్ కు సంబంధించిన విషయం కాబట్టి  పోలీసు వారి సహకారంతోనే సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తామన్నారు. ఇల్లెందు డిపోకి గతంలో 20 బస్సులు ఏర్పాటు చేశామని అదనంగా మరో మూడు బస్సులు కలిపి 23 బస్సులతో ఇల్లందు డిపో నడిపిస్తున్నామన్నారు. ఎలక్ట్రికల్ బస్సులు ప్రస్తుతం హైదరాబాద్ సిటీ  వరకే ఆర్టీసీ నడిపిస్తున్నదని, అవి 250 కిలోమీటర్ల వరకి ఛార్జింగ్ పనిచేస్తాయని అన్నారు. ఇంకా ఏమైనా నూతనంగా మోడల్స్ మారి చార్జింగ్ కెపాసిటీ పెరిగితే అప్పుడు అన్ని డిపోలలో అందుబాటులకి తెచ్చే అవకాశం ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్ఎం సరిరాం, డిప్యూటీ ఆర్ఎం మల్లయ్య,ఎస్ఎం ఎ.రాములు, ఏడిసి వై ఎన్ రావు, ఎంసి రమేష్, ట్రాఫిక్  ఇంచార్జ్ విజయలక్ష్మి మరియు సిబ్బంది పాల్గొన్నారు.

Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

ప్రతి వారం 250 పాడి పశువుల యూనిట్ల గ్రౌండింగ్.... జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ ప్రతి వారం 250 పాడి పశువుల యూనిట్ల గ్రౌండింగ్.... జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్
*జులై 15 తర్వాత పాడి పశువుల కొనుగోలు ప్రక్రియ ప్రారంభించాలి *ప్రతి పాడి పశువుకు ఆర్.ఎఫ్.ఐ.డి. ట్యాగింగ్ కల్పించాలి *ఇందిరా మహిళా డెయిరీ నిర్వహణపై సమీక్షించిన జిల్లా...
ఎస్.బి.ఐ. బ్యాంకు  ఆధ్వర్యంలో ఉచిత శిక్షణ
మ‌ళ్లీ మొద‌టి నుంచి దిల్లీ పంజాబ్ మ్యాచ్ !
గ్రామీణ బంద్ ను జయప్రదం చేయండి
కాళేశ్వరం సరస్వతి పుష్కరాల ప్రదేశం డ్రోన్ దృశ్యాలు.
క్రేజీ కాంబోలో సినిమా... 
పగడ్బందీగా ధాన్యం సేకరణ