హైదరాబాద్ సిటీ ఉద్యోగుల జాయింట్ యాక్షన్ కమిటీ ఆవిర్భావం
లోకల్ గైడ్ :
తెలంగాణ రాష్ట్ర స్థాయి జేఏసీ ఏర్పాటు చేయడం జరిగింది...అదే విధంగా అన్ని జిల్లాల్లో హైదరాబాద్ సిటీలో కూడా ఏర్పాటు చెయ్యమని రాష్ట్ర జాక్ చైర్మన్ శ్రీ మారం జగదీశ్ కో-చైర్మన్ శ్రీ ఏలూరి శ్రీనివాస్ ఆదేశించారు...కావున, బుధవారం నాడు, 3.30 గంటలకు, ప్రోటోకాల్ డిపార్ట్మెంట్లో, పబ్లిక్ గార్డెన్, నాంపల్లిలో...అన్ని శాఖల నుండి ఉద్యోగులు, అధికారులు, డ్రైవర్స్ , నాల్గవ తరగతి ఉద్యోగులు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు అధిక సంఖ్యలో పాల్గొని తెలంగాణ ఎంప్లాయిస్ జాయింట్ యాక్షన్ కమిటీ టీజీ ఈ జె ఏ సిని ఏర్పాటు చేసుకోవడం జరిగింది.టి జి ఈ జె ఎ సి హైదరాబాద్ సిటీకి కట్కూరి శ్రీకాంత్, అధ్యక్షులు,టీఎన్జీవో చైర్మన్ గా, శ్రీ గండూరి వెంకటేశ్వర్లు, అద్యక్షులు , టీఎన్జీవో కన్వీనర్ గా, శ్రీ పి.లక్ష్మణ్, అద్యక్షులు, నాల్గవ తరగతి ఉద్యోగుల సంఘం వైస్ చైర్మన్ గా ఎస్.నిరంజన్ రెడ్డి, కార్యదర్శి టీఎన్జీవో వైస్ చైర్మన్ గా, శ్రీ ఎ. శ్రీనివాస్, అధ్యక్షుడు, డ్రైవర్స్ అసోసియేషన్ వైస్ చైర్మన్ గా, శ్రీ పి.హరిక్రిష్ణ, కార్యదర్శి, టీఎన్జీవో ఫైనాన్స్ సెక్రటరీ గా , శ్రీ హథీక్ పాషా, కార్యదర్శి గార్లు నాల్గవ తరగతి ఉద్యోగుల సంఘం, శ్రీ డి.శివకుమార్, శ్రీమతి లావణ్య, శ్రీమతి కె. వరలక్ష్మి, శ్రీ జి. వి. కృష్ణా రావు, డాక్టర్ లక్ష్మయ్య, శ్రీ శ్యాం సుందర్, శ్రీ వెంకటేశ్వర్లు, , టి యు టి ఎఫ్ శ్రీకాంత్, అద్యక్షులు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు సంఘం, శ్రీ ప్రవీణ్ కుమార్ తదితరులు టి జి ఈ జె ఏ సి ప్రతినిధులుగా నియమించుకున్నారు.ఈ సమావేశంలో పలు శాఖల నుండి అధికారులు, ఉద్యోగులు, నాల్గవ తరగతి ఉద్యోగులు, డైవర్స్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.ఉద్యోగుల సమస్యల పై నిరంతర పోరాటం చేస్తామని నినాదాలు చేశారు.
Comment List