మారుమూల ఆదివాసి గ్రామాల్లో మెరుగైన వైద్యం సౌకర్యవంతంగా చూడాలి.
- డాక్టర్లతో సమావేశమైనా ఐటీడీఏ పీవో బి రాహుల్.
భద్రాచలం (లోకల్ గైడ్ )
భద్రాచలం మారుమూల ఆదివాసి గ్రామాలలో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు వచ్చే రోగులతో పాటు ముఖ్యంగా గర్భిణీ స్త్రీల పట్ల సంబంధిత మెడికల్ ఆఫీసర్లు సిబ్బంది ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని ఐటిడిఏ ప్రాజెక్టు అధికారి బి రాహుల్ అన్నారు. బుధవారం సాయంత్రం తన ఛాంబర్ లో మెడికల్ ఆఫీసర్లతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పిహెచ్ లలో పనిచేసే డాక్టర్లు స్టాప్ నర్సులు ఏఎన్ఎంలు వచ్చే రోగులతో పాటు గర్భిణీ స్త్రీల విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకొని నార్మల్ డెలివరీ అయ్యేలా చూడాలని, డెలివరీ కి వచ్చిన ప్రతి గర్భిణీ స్త్రీలను ఏరియా ఆసుపత్రులకు పంపకూడదని, మెడికల్ ఆఫీసర్లు వచ్చే రోగులతో పాటు సిబ్బంది విధుల పట్ల కూడా ప్రత్యేక బాధ్యతలు తీసుకోవాలని, డెలివరీ కి సంబంధించిన అన్ని విషయాలు మెడికల్ ఆఫీసర్ తో పాటు సంబంధిత స్టాఫ్ నర్స్ ఆశా వర్కర్లకు ఏఎన్ఎం లకు తెలిసి ఉండాలని, ప్రతి కేసు రిజిస్టర్ లో నమోదు చేయాలని, ప్రతి పీహెచ్సీలో ఈ రెండు నెలలలో డెలివరీ కేసులు ఎన్ని వచ్చాయి, ఎంతమంది గర్భిణీ స్త్రీలను ప్రైవేటు ఆసుపత్రులకు, ఏరియా ఆసుపత్రికి పంపించారు, పంపించడానికి కారణాల వివరాలు ప్రతిపాదనలు తయారుచేసి తనకు పంపించాలని, పిహెచ్సి లతోపాటు ఏరియా ఆసుపత్రిలో నార్మల్ డెలివరీలే అయ్యేలా చూడాలని, రాత్రిపూట వచ్చే డెలివరీ కేసులు గాని అత్యవసర కేసులు వస్తే డాక్టర్లు తప్పనిసరిగా అందుబాటులో ఉండి వైద్య చికిత్సలు చేయాలని, పి హెచ్ సి ల లో సిబ్బంది కొరత ఉంటే ఎక్కువగా ఉన్న వారిని తక్కువ ఉన్నచోట సర్దుబాటు చేయాలని, అంబులెన్స్ల విషయంలో కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలని, పీహెచ్సీలు ఎప్పుడు పరిశుభ్రంగా ఉండేలా చూసుకోవాలని, మందుల విషయంలో కూడా తగు జాగ్రత్తలు మెడికల్ ఆఫీసర్లు తీసుకోవాలని అన్నారు. ఏరియా ఆసుపత్రి ముందు ప్రైవేట్ అంబులెన్సులు ఉండకుండా చూడాలని, పీహెచ్సీలకు, ఏరియా ఆసుపత్రికి వచ్చే రోగులు బ్లడ్ శాంపిల్స్ తీసుకున్నప్పుడు సిబ్బంది ఎవరు వారి వద్ద డబ్బులు ఆశించకూడదని, రోగుల పట్ల సిబ్బంది మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని అన్నారు. రాత్రిపూట పీహెచ్సీలలో మరియు ఏరియా ఆసుపత్రిలో పనిచేసే గైనకాలజిస్టులు డాక్టర్లు తప్పనిసరిగా అందుబాటులో ఉండి గర్భిణీ స్త్రీలకు ప్రత్యేక వైద్య సౌకర్యాలు అందించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ డి ఎం హెచ్ ఓ జయలక్ష్మి, ఎ డి ఎం హెచ్ ఓ చైతన్య, ఏరియా ఆసుపత్రి పర్యవేక్షకుడు రామకృష్ణ మరియు గైనకాలజిస్టులు, మెడికల్ ఆఫీసర్లు తదితరులు పాల్గొన్నారు.
Comment List