ఎమ్మెల్యేచే రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభం
లోకల్ గైడ్ :
ఎల్లారెడ్డి నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తున్న ఎమ్మెల్యే మదన్మోహన్ రావు. తాడ్వాయి మండలం ఎర్రపహడ్ గ్రామానికి 10 లక్షల నిధులు మంజురు చేసి సీసీ రోడ్డు నిర్మాణ పనులకు గురువారం భూమి పూజ చేసి ప్రారంభించారు . ఈ సందర్భంగా ఎమ్మెల్యే మదన్ మోహన్ మాట్లాడుతూ ఎర్రపహడ్ గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల పధకం లబ్ధిదారుల ఇంటి నిర్మాణ పనులకు మరియు గ్రామస్థుల కోరిక మేరకు ఎర్రపహడ్ గ్రామ అభివృద్ధిలో భాగంగా రోడ్డు నిర్మాణానికి భూమి పూజ చేసినందుకు చాల సంతోషంగా ఉందని అన్నారు. గ్రామస్థుల కోరిక మేరకు ఎర్రపహడ్ గ్రామానికి మున్ముందు మరిన్ని నిధులు మంజురు చేస్తానాని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు . గత కొన్ని దశాబ్దాలుగా పాలకులకు పలుమార్లు విజ్ఞప్తి చేసిన పట్టించుకోలేదని గ్రామస్తులు అన్నారు . కోరిన వెంటనే సిసి రోడ్ల నిర్మాణానికి నిధులు మంజూరు చేసిన ఎమ్మెల్యే కు గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు .
Comment List