నేను... అప్పట్లో అథ్లెటిక్స్ నేషనల్స్ ఆడా...
* ఢిల్లీ స్థాయిలో ఖమ్మoలో సింథటిక్ రన్నింగ్ ట్రాక్ ఏర్పాటు కానుండడం సంతోషకరం
* మంత్రి తుమ్మల, ఎంపీ రామసహాయం రఘురాం రెడ్డి
ఖమ్మం లోకల్ గైడ్:
తాను 1978, 1979 కాలంలో జాతీయ అథ్లెటిక్స్ లో 400 మీటర్ల విభాగంలో ఆడానని, అప్పట్లో రన్నింగ్ ట్రాక్ కోసం సరైన సౌకర్యాలు ఉండేవి కావని ఖమ్మం పార్లమెంట్ సభ్యులు రామ సహాయం రఘురాం రెడ్డి అన్నారు. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు నగరంలోని సర్దార్ పటేల్ స్టేడియంలో సింథటిక్ రన్నింగ్ ట్రాక్, షటిల్ కోర్ట్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయగా.. ఎంపీ రఘురాం రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అప్పట్లో బొగ్గు, ఇతర పదార్థాలతో ట్రాక్లు ఏర్పాటు చేసేవారని.. ఢిల్లీలో మాత్రమే సింథటిక్ ట్రాక్ ఉండేదని, ఎంతో వింతగా చూసేవారమని గుర్తుచేశారు.
ప్రస్తుతం ఖమ్మం నగరంలో రూ. 8.50 కోట్లతో ఏర్పాటు కానుoడడం సంతోషకరమని అన్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ ముజమీల్ ఖాన్, మున్సిపల్ కమిషనర్ అభిషేక్ అగస్త్య, డి ఎస్డీఓ సునీల్ రెడ్డి, పలువురు ప్రజా ప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.
Comment List