‘హరిహర వీరమల్లు’ – వాయిదాల వెనక మూలాలు, అభిమానుల్లో గందరగోళం

‘హరిహర వీరమల్లు’ – వాయిదాల వెనక మూలాలు, అభిమానుల్లో గందరగోళం

లోక‌ల్ గైడ్ :
పవన్ కళ్యాణ్‌, క్రిష్ కాంబినేషన్‌లో చాలా కాలం క్రితం ప్రారంభమైన సినిమా ‘హరిహర వీరమల్లు’ ఇప్పటివరకు థియేటర్లలోకి రాలేదు. పవన్ రాజకీయాలతో బిజీగా ఉండటంతో సినిమా షూటింగ్ సజావుగా సాగలేదు. దీనివల్ల దర్శకుడు క్రిష్ ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నారు. అనంతరం జ్యోతికృష్ణ డైరెక్షన్ తీసుకుని ఇటీవలే షూటింగ్‌ను పూర్తిచేశారు.అయితే ఐదేళ్లుగా సెట్స్ మీదే ఉన్న ఈ సినిమా ఎట్టకేలకు జూన్ 12, 2025న విడుదల కానుందని మేకర్స్ ప్రకటించారు. కానీ ఇప్పటికీ విడుదలపై స్పష్టత లేకపోవడంతో అభిమానుల్లో సందేహాలు తలెత్తుతున్నాయి. కారణం – జూన్ 1 నుంచి తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లు బంద్ చేయాలని సినీ ఎగ్జిబిటర్లు తీసుకున్న నిర్ణయం. అద్దె ప్రాతిపదికన సినిమాలు ప్రదర్శించబోమని, కేవలం రెవెన్యూలో వాటా రూపంలో చెల్లిస్తేనే సినిమాలు ప్రదర్శిస్తామంటూ నిర్మాతలకు లేఖ రాసారు.ఈ పరిస్థితుల్లో ‘హరిహర వీరమల్లు’తో పాటు ‘థగ్ లైఫ్’, ‘కన్నప్ప’, ‘కుబేర’, ‘కింగ్డమ్’ వంటి భారీ సినిమాల విడుదలలు కూడా సందిగ్ధంలో పడ్డాయి. అయితే, ఇవన్నీ పెద్ద సినిమాలైనందున సమస్య త్వరగా పరిష్కారమయ్యే అవకాశముందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

ఈ సినిమా విడుదల తేదీల ట్రాక్ రికార్డ్ చూస్తే, అభిమానులకు ఆందోళన తటస్థం కాదు:

    మొదట 2022 సంక్రాంతి విడుదలగా ప్రకటించారు

    ఆపై 2022 ఏప్రిల్ 29 అని చెప్పారు

    మళ్లీ 2022 అక్టోబర్ 5గా వాయిదా వేశారు

    2023 జనవరి సంక్రాంతి అని చెప్పారు – రాలేదు

    2023 మార్చ్ 30 రిలీజ్ డేట్ అని చెప్పారు – జరగలేదు

    2023 దసరాకి వస్తుందన్నారు – ఆలస్యం

    2024 సమ్మర్లో వస్తుందని ప్రకటించారు – అయినా విడుదల కాలేదు

    2024 డిసెంబర్ వరకు షూటింగ్ వేగం పెంచినప్పటికీ – రిలీజ్ కాలేదు

    2025 జనవరి 26 ఖాయం అన్నారు – మళ్లీ వాయిదా

    తరువాత 2025 మార్చ్ 28 విడుదల అని హడావుడి చేశారు – కానీ గ్రాఫిక్స్, VFX పనుల కారణంగా మే 9కి వాయిదా వేశారు.కానీ మే 9న కూడా రిలీజ్ కాలేదు

    చివరికి ఇప్పుడు జూన్ 12 అని మరోసారి డేట్ ప్రకటించారు.ఇప్పటికైనా ఈ చిత్రం విడుదల అవుతుందా లేదా అన్నదానిపై స్పష్టత రాలేదు. అభిమానులు మాత్రం "ఈసారి అయినా పక్కా కదా?" అనే ప్రశ్నతో ఎదురుచూస్తున్నారు.

Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి  సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి 
కరీంనగర్ : లోకల్ గైడ్:వివిధ కారణాలతో అనారోగ్యానికి గురై ఆర్థికంగా ఇబ్బందులు ప డ్డవారిని ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా ఆదుకుంటున్నామని సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి...
సబ్సిడీ జీలుగు విత్తనాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలి 
జాతీయ రక్షణ నిధికి లక్ష రూపాయల విరాళం
ప్రజా ఫిర్యాదుల పరిష్కారం పై శ్రద్ధ వహించండి
జీలుగు విత్తనాలను పంపిణీ చేసిన ఎమ్మెల్యే యశస్విని రెడ్డి    
గణంగా కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య గారి 40వ వర్ధంతి. 
తొర్రురులో కాంగ్రెస్ పార్టీ సంస్థాగత నిర్మాణ సన్నాహక సమావేశం