త్వరలో విడుదల కానున్న కొత్త రూ.20 నోట్లు – ఆర్‌బీఐ ప్రకటన

త్వరలో విడుదల కానున్న కొత్త రూ.20 నోట్లు – ఆర్‌బీఐ ప్రకటన

లోక‌ల్ గైడ్ 
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) తాజాగా కీలక ప్రకటన చేసింది. మహాత్మా గాంధీ (కొత్త) సిరీస్‌లో భాగంగా త్వరలో కొత్త రూపాయల 20 నోట్లను విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. ఈ నోట్లపై ఇటీవల పదవీలోకి వచ్చిన ఆర్‌బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా సంతకం ఉండనుంది.కొత్త రూ.20 నోట్ల డిజైన్ ప్రస్తుతం చలామణిలో ఉన్న మహాత్మా గాంధీ (కొత్త) సిరీస్ నోట్ల మాదిరిగానే ఉండనుంది. ఇక ఇప్పటివరకు కేంద్ర బ్యాంకు జారీ చేసిన అన్ని రూ.20 నోట్లు చట్టబద్ధంగానే చలామణిలో కొనసాగుతాయని ఆర్‌బీఐ ఓ అధికారిక నోటిఫికేషన్‌లో స్పష్టం చేసింది.
కొత్త గవర్నర్ బాధ్యతలు స్వీకరించిన అనంతరం, ఆ గవర్నర్ సంతకంతో కొత్త కరెన్సీని జారీ చేయడం అనేది సాధారణ ప్రక్రియ అని RBI పేర్కొంది. ఇది ప్రస్తుత నోట్ల విలువకు గానీ, చలామణిలో ఉన్న కరెన్సీకి గానీ ఎలాంటి ప్రభావం చూపదని కూడా స్పష్టం చేసింది.

Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి  సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి 
కరీంనగర్ : లోకల్ గైడ్:వివిధ కారణాలతో అనారోగ్యానికి గురై ఆర్థికంగా ఇబ్బందులు ప డ్డవారిని ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా ఆదుకుంటున్నామని సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి...
సబ్సిడీ జీలుగు విత్తనాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలి 
జాతీయ రక్షణ నిధికి లక్ష రూపాయల విరాళం
ప్రజా ఫిర్యాదుల పరిష్కారం పై శ్రద్ధ వహించండి
జీలుగు విత్తనాలను పంపిణీ చేసిన ఎమ్మెల్యే యశస్విని రెడ్డి    
గణంగా కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య గారి 40వ వర్ధంతి. 
తొర్రురులో కాంగ్రెస్ పార్టీ సంస్థాగత నిర్మాణ సన్నాహక సమావేశం