అక్క‌డ వ‌ణికించిన భూకంపం.....

నాలుగు రోజుల్లో నాలుగోసారి ప్రకంపనలు ఎక్క‌డో తెలుసా.......

అక్క‌డ వ‌ణికించిన భూకంపం.....

లోక‌ల్ గైడ్ : తాలిబన్ పాలనలో ఉన్న అప్ఘానిస్థాన్‌లో సోమవారం ఉదయం భూకంపం సంభవించింది. ఈ ప్రకంపనలు రిక్టర్ స్కేల్‌పై 4.2 తీవ్రతతో నమోదయ్యాయని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ (NCS) ప్రకటించింది. భూకంప కేంద్రం భూమికి 140 కిలోమీటర్ల లోతులో గుర్తించినట్లు వెల్లడించింది. అయితే, ఈ భూకంపంతో ప్రాణ లేదా ఆస్తి నష్టం గురించి ఇప్పటివరకు ఎలాంటి సమాచారం అందలేదు.గత నాలుగు రోజుల్లో ఇదే నాలుగో భూకంపం కావడంతో ప్రజల్లో తీవ్ర భయాందోళన నెలకొంది.

చైనా, టిబెట్, మయన్మార్‌లోనూ వరుస భూకంపాలు

ఆదివారం చైనాలో కూడా భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై 4.5 తీవ్రతతో ప్రకంపనలు వచ్చాయని ఎన్సీఎస్ తెలిపింది. భారత కాలమానం ప్రకారం రాత్రి 11 గంటలకు భూమి కంపించినట్లు వెల్లడించింది. భూగర్భ కేంద్రం 10 కిలోమీటర్ల లోతులో ఉన్నట్లు పేర్కొంది.అదే రోజు టిబెట్‌లో రెండు విడతలుగా భూ ప్రకంపనలు నమోదయ్యాయి. మొదటి భూకంపం మధ్యాహ్నం 1:14 గంటలకు, 3.8 తీవ్రతతో, రెండోది సాయంత్రం 5:07 గంటలకు, 3.7 తీవ్రతతో సంభవించాయని ఎన్సీఎస్ వెల్లడించింది.అంతేకాదు, మయన్మార్‌లో ఆదివారం ఉదయం భూమి కంపించిందని సమాచారం. అక్కడ 3.9 తీవ్రతతో ప్రకంపనలు నమోదయ్యాయి.

Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి  సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి 
కరీంనగర్ : లోకల్ గైడ్:వివిధ కారణాలతో అనారోగ్యానికి గురై ఆర్థికంగా ఇబ్బందులు ప డ్డవారిని ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా ఆదుకుంటున్నామని సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి...
సబ్సిడీ జీలుగు విత్తనాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలి 
జాతీయ రక్షణ నిధికి లక్ష రూపాయల విరాళం
ప్రజా ఫిర్యాదుల పరిష్కారం పై శ్రద్ధ వహించండి
జీలుగు విత్తనాలను పంపిణీ చేసిన ఎమ్మెల్యే యశస్విని రెడ్డి    
గణంగా కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య గారి 40వ వర్ధంతి. 
తొర్రురులో కాంగ్రెస్ పార్టీ సంస్థాగత నిర్మాణ సన్నాహక సమావేశం