ఎన్టీఆర్ పుట్టినరోజు కానుక: ‘వార్ 2’ టీజర్ విడుదల | LOCAL GUIDE

హృతిక్‌తో యంగ్ టైగర్ పోరుబడిన యాక్షన్ విజువల్ ఫీస్ట్ – కియారా గ్లామర్ అదనపు ఆకర్షణ

ఎన్టీఆర్ పుట్టినరోజు కానుక: ‘వార్ 2’ టీజర్ విడుదల | LOCAL GUIDE

ఎన్టీఆర్ పుట్టినరోజు కానుక విడుదలతో ఉత్సాహంగా జరుపుకోండి: ‘వార్ 2’ టీజర్ విడుదల! మే 20 న ఆవిష్కరించబడిన, యష్ రాజ్ ఫిల్మ్స్ నుండి వచ్చిన ఈ యాక్షన్-ప్యాక్డ్ టీజర్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ అభిమానులను ఆనందపరుస్తుంది, సోషల్ మీడియాను తుఫానుగా తీసుకుంది. అన్ని తాజా అప్‌డేట్‌లను కనుగొనండి మరియు స్థానిక గైడ్‌లో వేడుకలో చేరండి!

 లోకల్ గైడ్  హైదరాబాద్:
యంగ్ టైగర్ ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా విడుదలైన బాలీవుడ్ భారీ చిత్రం ‘వార్-2’ టీజర్ ఇప్పుడు సోషల్ మీడియాలో దూసుకెళ్తోంది. యశ్ రాజ్ ఫిల్మ్స్ రూపొందిస్తున్న ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్‌కు సంబంధించిన టీజర్, మే 20న ఉదయం విడుదల కావడంతో ఎన్టీఆర్ అభిమానులు సంబరాల్లో మునిగిపోయారు.

టీజర్ ఎన్టీఆర్ పవర్‌ఫుల్ డైలాగ్‌తో ప్రారంభమవడం విశేషం. హృతిక్ రోషన్‌తో తలపడే యాక్షన్ సీక్వెన్సెస్ ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటున్నాయి. టీజర్‌లో ఎన్టీఆర్ స్క్రీన్ ప్రెజెన్స్, యాక్షన్ స్టైల్ బాలీవుడ్‌ ప్రేక్షకులని కూడా ఆశ్చర్యపరిచేలా ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. బాలీవుడ్‌ ప్రాజెక్ట్‌ అయినా ఎన్టీఆర్‌కి ఎక్కువ స్కోప్ ఇచ్చినట్టు టీజర్ చూస్తే అర్థమవుతోంది.

ఇక, కథానాయిక కియారా అద్వాణి లుక్, గ్లామర్ అదనపు ఆకర్షణగా నిలిచిందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
టీజర్‌పై ఇప్పటికే సోషల్ మీడియా వేదికగా అభిమానుల స్పందనలు వెల్లువెత్తుతున్నాయి. "ఎన్టీఆర్ మాస్ యాక్షన్ లుక్ అదిరిపోయింది", "ఇది హృతిక్-ఎన్టీఆర్ యుద్ధం కాదు, టక్కరిగా ఇద్దరూ కనపడుతున్నారు" అంటూ కామెంట్లు చేస్తున్నారు.

ఈ టీజర్‌తో సినిమాపై అంచనాలు రెట్టింపు కాగా, పూర్తి ట్రైలర్‌పై ఆసక్తి మరింత పెరిగింది.

Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

ఒకరు మ్యాచ్ను అద్భుతంగా ముగించగలడు, మరొకరు అద్భుతంగా ప్రారంభించగలడు వారు ఎవ‌రో తెలుసా.... ఒకరు మ్యాచ్ను అద్భుతంగా ముగించగలడు, మరొకరు అద్భుతంగా ప్రారంభించగలడు వారు ఎవ‌రో తెలుసా....
లోక‌ల్ గైడ్ : ఈరోజు రాత్రి 7:30 గంటలకు దిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్ మరియు రాజస్థాన్ రాయల్స్ మధ్య మ్యాచ్ జరగనుంది....
కార్మిక ప్రజావ్యతిరేక విధానాలు మానుకోవాలి
పుష్కరాల్లో సరస్వతి నవరత్నమాల హారతి
దేశవ్యాప్తంగా ట్రాఫిక్ జరిమానాలు రూ.12 వేల కోట్లు!
మాజీ సీఎం కేసీఆర్‌కు కాళేశ్వరం విచారణ నోటీసులు
“మాకూ టైమ్ వస్తుంది... అప్పుడు చూపిస్తాం”: చంద్రబాబుపై జగన్ ఆగ్రహం
ముంబై ఇండియన్స్ జట్టులో కీలక మార్పులు – కొత్త ఆటగాళ్లకు అవకాశాలు