చింత‌చిగురు ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తాయో తెలుసా.....

లోక‌ల్ గైడ్ :
చింతపండు మనం పలు రకాల వంటల్లో వాడతాం. ముఖ్యంగా పప్పు, పులుసు, చారు వంటి వంటకాలలో దీనిని తరచుగా ఉపయోగిస్తారు. ఇది వంటలకు చక్కటి రుచిని ఇస్తుంది. అయితే చింతపండు మాత్రమే కాకుండా చింతచిగురూ ఎంతో రుచిగా ఉంటుంది. ఈ కాలంలో చింతచిగురు సులభంగా లభిస్తుంది, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో.చింతచిగురుతో పప్పులు, పచ్చడులు, పులిహోర, కొన్నిసార్లు మాంస వంటలు కూడా తయారు చేస్తారు. ఇవన్నీ ఎంతో రుచిగా ఉండటమే కాకుండా ఆరోగ్యానికి కూడా మేలు చేస్తాయని ఆయుర్వేదం చెబుతోంది. చింతచిగురులో పలు పోషకాలతో పాటు ఆరోగ్యానికి హితమైన గుణాలు ఉన్నాయి.
వాపులు, నొప్పులకు ఉపశమనం:

చింతచిగురులో యాంటీ ఇన్‌ఫ్లామేటరీ గుణాలు ఉంటాయి. ఇవి కీళ్ల నొప్పులు, కండరాల నొప్పులు, వాపుల నుంచి ఉపశమనం కలిగిస్తాయి. చింతచిగురును తినడం లేదా మెత్తగా నూరి పెట్టగా ఉపయోగిస్తే మంచి ఫలితం ఉంటుంది.
ఇన్‌ఫెక్షన్లకు చెక్:దీనిలో ఉండే యాంటీ మైక్రోబియల్ లక్షణాలు బ్యాక్టీరియా, వైరస్, ఫంగస్‌లను నివారించడంలో సహాయపడతాయి. చర్మ సంబంధిత సమస్యలైన చుండ్రు, దురద, గజ్జి, తామర వంటివి తగ్గించడంలో కూడా ఇది ఉపయుక్తంగా ఉంటుంది.
జీర్ణక్రియకు మేలు:ఫ్లేవనాయిడ్లు, పాలిఫినాల్స్ వంటి యాంటీ ఆక్సిడెంట్లు చింతచిగురులో పుష్కలంగా ఉన్నాయి. ఇవి శరీరాన్ని ఫ్రీ రాడికల్స్‌ నుండి రక్షిస్తాయి, కణాల రక్షణతో పాటు క్యాన్సర్‌ నివారణలో కూడా సహాయపడతాయి. మలబద్దకం, అజీర్తి వంటి సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఆకలి పెరిగేలా చేస్తుంది.
షుగర్ నియంత్రణకు:చింతచిగురు డయాబెటిస్‌ ఉన్నవారికి ఉపయోగపడుతుంది. ఇది రక్తంలోని షుగర్‌ స్థాయిని తగ్గించడంలో, ఇన్సులిన్‌ను శరీరం సమర్థవంతంగా ఉపయోగించుకోవడంలో సహాయపడుతుంది.
జ్వరం తగ్గించడంలో సహాయం:పూర్వ కాలంలో జ్వరం వచ్చిన వారికి చింతచిగురుతో తయారైన సూప్‌ను ఇచ్చేవారు. ఇది శరీర ఉష్ణోగ్రతను తగ్గించి త్వరగా కోలుకునేలా చేస్తుంది. అలాగే శ్వాసకోశ సంబంధిత సమస్యలైన దగ్గు, జలుబును తగ్గిస్తుంది.
రోగనిరోధక శక్తికి బలంపరచడం:చింతచిగురులో విటమిన్ C అధికంగా ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంచి అనేక వ్యాధుల నుండి రక్షణ కల్పిస్తుంది.  ఈ కాలంలో ఎక్కడైనా చింతచిగురు కనిపిస్తే అలసిపోకుండా తెచ్చుకోండి. ఇది రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా అందించే అద్భుతమైన ప్రకృతి పూత.

Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

లక్ష్మీ దేవి ఆశీస్సుల కోసం మీ పర్సులో ఉంచుకోవాల్సిన 5 ముఖ్యమైన వస్తువులు లక్ష్మీ దేవి ఆశీస్సుల కోసం మీ పర్సులో ఉంచుకోవాల్సిన 5 ముఖ్యమైన వస్తువులు
లక్ష్మీ దేవి ఆశీస్సులు పొందడానికి మీ పర్సులో ఉంచుకోవాల్సిన 5 ముఖ్యమైన వస్తువులను కనుగొనండి. ఈ వస్తువులు మీ జీవితంలో శ్రేయస్సును ఎలా ఆకర్షిస్తాయో మరియు శుభ...
వరంగల్ రైల్వే స్టేషన్ ను ప్రజలకు అంకితం చేసిన మోడీ
అర్హత కలిగిన పేద కుటుంబాలకు మాత్రమే ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలి
జీలుగ పంటతో భూసారాన్ని పెంచండి
చేయూత పెన్షన్లను సక్రమంగా పంపిణీ చేయాలి.
శిల్పారామంలో ప్రపంచ సుంద‌రీమ‌ణుల సంద‌డి 
అండర్‌-19 జట్టుకెప్టెన్‌గా ఆయుష్ మాత్రే, వైస్ కెప్టెన్‌గా అభిజ్ఞాన్ కుండు