రైతులు ఎలాంటి ఆందోళన చెందవద్దు.

ప్రతి గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది.

రైతులు ఎలాంటి ఆందోళన చెందవద్దు.

 జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్.

నిర్మల్ : లోకల్ గైడ్ :
ఇటివల కురిసిన భారీ వర్షం కారణంగా ఖానాపూర్ మార్కెట్‌యార్డ్‌లో తడిసిన ధాన్యాన్ని గురువారం జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్, శాసనసభ్యులు వెడ్మ బొజ్జు పటేల్‌లతో కలిసి పరిశీలించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, వరి రైతులు నష్టపోకుండా అన్ని చర్యలు తీసుకుంటామని తెలిపారు.  వర్షంతో ధాన్యం తడవడంతో రైతులు ఎలాంటి ఆందోళన చెందవద్దని కోరారు. ప్రతి గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని, రైతులు నష్టపోకుండా తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అధిక తూకం తో కొనుగోళ్లు జరిపితే సంబంధిత నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ధాన్యం శుభ్రపరిచి, ఎండబెట్టే ఏర్పాట్లు చేయాలని, కొనుగోళ్లను వేగవంతం చేసి వెంటవెంటనే మిల్లులకు తరలించాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు.
ఎంఎల్ఏ బొజ్జు పటేల్ మాట్లాడుతూ, వర్షాలతో ధాన్యం తడవడం బాధకరమని, కొనుగోళ్లను వేగవంతం చేయాలనీ అధికారులను ఆదేశించారు. ప్రభుత్వం పూర్తిగా రైతుల పక్షాన నిలుస్తుందని తెలిపారు. అధిక తూకాలు వేయడం, తక్కువ ధరలకు కొనుగోలు చేయడం వంటి పరిస్థితులు తలెత్తకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. మార్కెట్‌యార్డ్‌లో తడిసిన ధాన్యాన్ని పరిశీలించి, తక్షణ చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.ఈ పరిశీలనలో అదనపు కలెక్టర్ కిషోర్ కుమార్, ఆర్డీఓ రత్నాకళ్యాణి, సివిల్ సప్లై డి ఎం సుధాకర్, తహసీల్దార్ సుజాత, వ్యవసాయ అధికారులు, రైతులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

లక్ష్మీ దేవి ఆశీస్సుల కోసం మీ పర్సులో ఉంచుకోవాల్సిన 5 ముఖ్యమైన వస్తువులు లక్ష్మీ దేవి ఆశీస్సుల కోసం మీ పర్సులో ఉంచుకోవాల్సిన 5 ముఖ్యమైన వస్తువులు
లక్ష్మీ దేవి ఆశీస్సులు పొందడానికి మీ పర్సులో ఉంచుకోవాల్సిన 5 ముఖ్యమైన వస్తువులను కనుగొనండి. ఈ వస్తువులు మీ జీవితంలో శ్రేయస్సును ఎలా ఆకర్షిస్తాయో మరియు శుభ...
వరంగల్ రైల్వే స్టేషన్ ను ప్రజలకు అంకితం చేసిన మోడీ
అర్హత కలిగిన పేద కుటుంబాలకు మాత్రమే ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలి
జీలుగ పంటతో భూసారాన్ని పెంచండి
చేయూత పెన్షన్లను సక్రమంగా పంపిణీ చేయాలి.
శిల్పారామంలో ప్రపంచ సుంద‌రీమ‌ణుల సంద‌డి 
అండర్‌-19 జట్టుకెప్టెన్‌గా ఆయుష్ మాత్రే, వైస్ కెప్టెన్‌గా అభిజ్ఞాన్ కుండు