జూనియర్ కళాశాలను సందర్శించి పరిశీలించిన

--ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి

జూనియర్ కళాశాలను సందర్శించి పరిశీలించిన

-సమస్యలను గుర్తించి వెంటనే పరిష్కరించాలని, అధికారులకు సూచన ---------నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరిక,

---పట్టింపు లేని అధికారులపై ఆగ్రహం

---సమస్యలపై అధ్యాపకులతో ఆరా

వనపర్తి లోకల్ గైడ్,

వనపర్తి పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలను బుధవారం వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి సందర్శించిన పరిశీలించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే కళాశాల అధ్యాపకులతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.కళాశాల పూర్తిగా శిథిలావస్థకు చేరిందనీ, తరగతి గదులు మరుగుదొడ్లు, ల్యాబ్ గదులు, కంప్యూటర్ ల్యాబ్ గదులు, పూర్తిగా శిథిలమైపోయాయని, నీటి వసతి లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని,    మౌలిక వసతులు కల్పిస్తే నూతన భవనాలు నిర్మించే వరకు విద్యాభ్యాసాన్ని ఇక్కడే కొనసాగిస్తామని అధ్యాపకులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. ఇందుకు స్పందించిన ఎమ్మెల్యే వారం రోజుల్లో కళాశాలలోని ప్రతి సమస్యను పరిష్కరించాలని అందుకు కావలసిన చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. మార్చు 2వ తేదీన ఇక్కడ అధునాతన హంగులతో  నూతన విద్యాలయాల నిర్మాణానికి రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి  శంకుస్థాపన చేశారని అతి త్వరలోనే  ఇందుకు సంబంధించిన పనులు చేపట్టబోతున్నట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్  వినోద్ కుమార్ రెడ్డి, వనపర్తి వ్యవసాయ మార్కెట్ యార్డ్ అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్, వనపర్తి పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చీర్ల చందర్, మున్సిపల్  శాఖ డిఇ ఏఇ , కళాశాల అధ్యాపకులు, పట్టణ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Post Comment

Comment List

Latest News