ఫీల్డ్ అసిస్టెంట్ ను నియమించేది ఎప్పుడు?
- ప్రతీ ఏటా ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఉపాధి కూలీలు.
- ఉపాధి కూలీలకు ఫీల్డ్ అసిస్టెంట్ ను నియమించాలని దామర్చడ్ గ్రామస్తుల డిమాండ్.
లోకల్ గైడ్/బషీరాబాద్:
బషీరాబాద్ మండల పరిధిలోని దామర్చేడ్ గ్రామంలో, ఉపాధి కూలీలకు ఫీల్డ్ అసిస్టెంట్ ను ఎప్పుడూ నియమిస్తారని ఉపాధి హామీ కూలీలు సంబంధిత అధికారులను ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుతానికి ఉపాధి హామీ పనులు చేయించడానికి సీనియర్ మేట్ అయినటువంటి తమ్మప్ప అనే యువకుడు...కూలీల నుంచి పనికి సంబంధించి దరఖాస్తులను సేకరిస్తున్నాడు.దీంట్లో భాగంగా, కూలీలకు పని ప్రదేశంలో కొలతలు అందిస్తూ పని కల్పిస్తున్నారు.ఒక ఫీల్డ్ అసిస్టెంట్ చేయాల్సిన పని సీనియర్ మేటు చేత ఫీల్డ్ అసిస్టెంట్ కు సంబంధించిన విధులను చేయిస్తున్నారు.ఎలాంటి జీతం ఇవ్వకుండా, కేవలం తన హాజరు మాత్రమే వేసుకుంటూ.. ఫీల్డ్ అసిస్టెంట్ విధులు నిర్వర్తిస్తున్నాడు.జీతం ఇవ్వకుండా పనిచేయించుకోవడం శ్రమదోపిడి అవుతుందని పలువురు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఆశ్చర్యం ఏమిటంటే...చుట్టుపక్కల అన్ని గ్రామాలలో ఉపాధి హామీ పనులకు సంబంధించి, ఫీల్డ్ అసిస్టెంట్లు ఉన్నారు.కానీ దామర్చేడ్ గ్రామంలో మాత్రము ఫీల్డ్ అసిస్టెంట్ ను నియమించలేదు.ఫీల్డ్ అసిస్టెంట్ లేకపోవడంతో పని ప్రదేశంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని కూలీలు వాపోతున్నారు. సంబంధిత అధికారుల స్పందించి, తక్షణమే ధామర్చడ్ గ్రామపంచాయతీకి ఫీల్డ్ అసిస్టెంట్ ను నియమించాలని ఉపాధి హామీ కూలీలు అధికారులను కోరుతున్నారు.
Comment List