లత్తిపురంలో ఘనంగా విగ్రహ ప్రతిష్ట
By Ram Reddy
On
గద్వాల, లోకల్ గైడ్:
గద్వాల మండలం లత్తిపురం గ్రామంలో బండల శ్రీ సోమేశ్వర స్వామి, శ్రీ చౌడేశ్వరి దేవి విగ్రహ ప్రతిష్ట మహోత్సవం బుధవారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో బీజేపీ యువ నాయకురాలు డీకే స్నిగ్దా రెడ్డి, జిల్లా అధ్యక్షులు రామాంజనేయులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముందుగా లత్తిపురం గ్రామ ప్రజలు డికె.స్నిగ్దా రెడ్డి ని శాలువతో ఘనంగా సత్కరించారు. స్వామి వారి విగ్రహ ప్రతిష్టను తిలకించేందుకు గ్రామస్తులు భారీగా తరలివచ్చారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు శ్రీనివాసులు, బిజెపి నాయకులు బాలేశ్వర్ రెడ్డి, లత్తిపురం రామిరెడ్డి, మధుసూదన్ రెడ్డి, అశోక్ రెడ్డి, రాజు యాదవ్, పరుష తదితరులు ఉన్నారు.
Tags:
About The Author
Related Posts
Post Comment
Latest News
05 Jun 2025 17:40:11
తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ కు వినతిపత్రం సమర్పించిన ఎమ్మెల్యే
Comment List