ఘనంగా అఖిల్ – జైనబ్ వెడ్డింగ్ & రిసెప్షన్

ఘనంగా అఖిల్ – జైనబ్ వెడ్డింగ్ & రిసెప్షన్

నాగార్జున రెండో కుమారుడు అఖిల్ వివాహం జైనబ్‌తో జూన్ 6న హైదరాబాద్‌లోని నాగార్జున నివాసంలో సన్నిహితుల మధ్య ప్రైవేట్ వేడుకగా జరిగిందని తెలిసిందే. ఈ పెళ్లికి ఇరువైపుల కుటుంబసభ్యులు, సినీ ప్రముఖులు హాజరై నూతన దంపతులను ఆశీర్వదించారు.గత కొంతకాలంగా ప్రేమలో ఉన్న అఖిల్, జైనబ్ గత ఏడాది నవంబర్‌లో నిశ్చితార్థం చేసుకోగా, ఈ నెల 6న వివాహబంధంతో ఒక్కటయ్యారు. జూన్ 8న అన్నపూర్ణ స్టూడియోస్‌లో గ్రాండ్‌గా నిర్వహించిన వెడ్డింగ్ రిసెప్షన్‌కు సినీ, రాజకీయ ప్రముఖులు భారీగా హాజరయ్యారు.వేడుకలో ముఖ్యంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, తమిళ హీరో సూర్య, డైరెక్టర్ వెంకీ అట్లూరి, రాకింగ్ స్టార్ యష్, నాచురల్ స్టార్ నాని (తన భార్యతో), హీరో నిఖిల్ (తన కుటుంబంతో), మెగా పవర్ స్టార్ రామ్ చరణ్-ఉపాసన, సూపర్ స్టార్ మహేష్ బాబు-నమ్రత, వారి కుమార్తె సితార, డైరెక్టర్ సుకుమార్, బుచ్చిబాబు, సుధీర్ బాబు, అల్లరి నరేష్ తదితరులు హాజరై కొత్త దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు.రిసెప్షన్‌లో అఖిల్ వైట్ వెస్ట్రన్ సూట్‌లో స్టైలిష్‌గా కనిపించగా, జైనబ్ క్రీమ్ కలర్ లాంగ్ గౌన్‌లో మెరిసిపోయింది. ఈ వేడుకకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో విస్తృతంగా పంచుకుంటున్నారు.అక్కినేని ఫ్యామిలీ మొత్తం ఒక గ్రూప్ ఫోటోలో కనిపించగా, అందులో నాగార్జున, అమల, అఖిల్, నాగచైతన్య, శోభిత, వెంకట్ ఫ్యామిలీ, నాగ సుశీల, సుశాంత్, సుప్రియ, సుమంత్ తదితరులు ఉన్నారు. ఆ ఫోటో ప్రస్తుతం నెట్‌లో వైరల్ అవుతోంది.

Tags:

About The Author

Post Comment

Comment List

Latest News