తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ డిగ్రీ కళాశాలలో అర్హులైన

 మహిళా విద్యార్థులు జూన్ 23 తేదీలోగా దరఖాస్తులు చేసుకోవాలి

తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ డిగ్రీ కళాశాలలో అర్హులైన

   వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ 

వికారాబాద్, లోకల్ గైడ్:

బుధవారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో వికారాబాద్ తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ మహిళ డిగ్రీ కళాశాల ప్రవేశాలకు సంబంధించిన గోడ ప్రతిని జిల్లా కలెక్టర్ ఆవిష్కరించారు.  ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ... వికారాబాద్ కు సంబంధించిన డిగ్రీ మహిళా కళాశాల మొయినాబాద్ మండలం, తోలు కట్ట సమీపంలో నిర్వహించడం జరుగుతుందన్నారు. డిగ్రీ కళాశాలలో బీఎస్సీ (ఎంపీసీఎస్, ఎంఎస్సిఎస్, బిజెడ్సి, ఎంజెడ్సి), బీకాం (బిఏ, సిఎ), బిఎ (హెచ్ఈపి) కోర్సుల లో ప్రవేశాలు అందుబాటులో ఉన్నాయని ఆయన తెలిపారు.  దరఖాస్తు చేసుకునే విద్యార్థులు పదవ తరగతి, ఇంటర్మీడియట్ మార్కుల మెమో (అటేస్టెడ్ గెజిటెడ్ అదికారి), కుల ధ్రువీకరణ పత్రం, ఆధార్ కార్డ్ జిరాక్స్ కాపీ, 5 పాస్పోర్ట్ సైజ్ ఫోటోలతో పాటుగా జనవరి- 2025 తర్వాత పొందిన తాజా ఆదాయ ధ్రువీకరణ పత్రం (గ్రామీణ 1,50,000 రూపాయలు,  పట్టణ ప్రాంతానికి చెందిన వారు 2 రెండు లక్షల రూపాయలు) ను దరఖాస్తుకు జత చేసి నేరుగా జూన్ 23 లోపు  కళాశాలలో అందజేయాలని కలెక్టర్ తెలిపారు.గోడప్రతి ఆవిష్కరణలో అదనపు కలెక్టర్ సుధీర్, డి సి ఓ సాయి లత, కళాశాలల ప్రిన్సిపాల్స్ డాక్టర్ విజయ కోట, అశోక్, డిఇఓ రేణుకా దేవి తదితరులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

*జడ్చర్లలో భారీ వర్షం నేతాజీచౌరస్తా వద్ద ట్రాఫిక్ జామ్,*ఘటన స్థలానికి వెంటనే చేరుకున్న ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి *జడ్చర్లలో భారీ వర్షం నేతాజీచౌరస్తా వద్ద ట్రాఫిక్ జామ్,*ఘటన స్థలానికి వెంటనే చేరుకున్న ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి
  మిడ్జిల్ (లోకల్ గైడ్): జడ్చర్లలో కురిసిన భారీ వర్షం కారణంగా, జడ్చర్ల మున్సిపాలిటీ పరిధిలోని నేతాజీ చౌరస్తా వైపు వెళ్లే ప్రధాన రహదారిపై గురువారం భారీగా
విమాన ప్ర‌మాద ఘ‌ట‌న‌పై తీవ్ర విచారం వ్య‌క్తం చేసిన ఎన్టీఆర్, అల్లు అర్జున్, జాన్వీ ......
మెడికల్ కాలేజ్ హాస్టల్‌పై విమానం కుప్పకూలిన దారుణ ఘటన
వంగూరులో తొలి తెలంగాణ పబ్లిక్ స్కూల్
బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు కృషి
రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన
చిరువ్యాపారులకు భరోసా ఇచ్చిన మహేశ్వరం నియోజకవర్గం