అవ‌తార్‌ని మించి అట్లీ

బన్నీ మూవీ.. రోబోలు, జంతువుల‌తో

అవ‌తార్‌ని మించి అట్లీ

లోక‌ల్ గైడ్:

AA22 x A6 | ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సినిమాలు రోజు రోజుకి ప‌రిధి దాటుతున్నాయి. కోలీవుడ్, బాలీవుడ్ స్థాయిల‌ని దాటేసిన బన్నీ ఇప్పుడు హాలీవుడ్‌పై క‌న్నేసిన‌ట్టు తెలుస్తుంది. AA22 x A6 | ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సినిమాలు రోజు రోజుకి ప‌రిధి దాటుతున్నాయి. కోలీవుడ్, బాలీవుడ్ స్థాయిల‌ని దాటేసిన బన్నీ ఇప్పుడు హాలీవుడ్‌పై క‌న్నేసిన‌ట్టు తెలుస్తుంది. పుష్ప 2 త‌ర్వాత బ‌న్నీ ఏ సినిమా చేస్తాడా అని అంద‌రిలో అనేక అనుమానాలు ఉండ‌గా, వాటికి ఈ రోజు క్లారిటీ వ‌చ్చింది. అట్లీతో చేయ‌నున్నాడ‌ని, సన్ పిక్చర్స్ భారీ స్థాయిలో నిర్మించ‌నుంద‌ని మేకింగ్ వీడియోతో అర్ధ‌మైంది. ఇక ఈ ప్రాజెక్ట్‌కి AA22xA6 వర్కింగ్‌ టైటిల్‌ పెట్టారు. అంటే.. అల్లు అర్జున్ 22వ చిత్రం, అట్లీ దర్శకుడిగా 6వ చిత్రంగా వ‌స్తున్న ఈ మూవీ ఎలాంటి క‌థ‌తో రూపొందుతుంది అనే చర్చ సాగుతుంది. అట్లీ స్క్రిప్ట్ చదివిన తర్వాత ఈ ప్రాజెక్ట్‌ చాలా ఎనర్జిటిగ్‌ ఉందని వాస్తవంగా చాలా సవాలుతో కూడిన ప్రాజెక్ట్‌లలో ఇది ఒక‌టి అని హాలీవుడ్ టెక్నీషియ‌న్స్ మేకింగ్ వీడియోలో తెలియ‌జేశారు.ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్‌ పనులు శ‌ర‌వేగంగా జ‌రుగుతుండ‌గా, ఈ చిత్రానికి లాస్‌ఏంజెల్స్‌కు చెందిన వీఎఫ్‌ఎక్స్‌ సంస్థ పనిచేస్తోందని వీడియోని బ‌ట్టి అర్ధ‌మైంది. ఈ సినిమా సైంటిఫిక్‌ తరహాలో, ఏలియన్స్‌, గ్రహాంతరవాసుల నేప‌థ్యంలో రూపొంద‌నుంద‌ని తెలుస్తుంది. వీడియోలో హీరో, ద‌ర్శ‌కుడు ప‌లు బొమ్మ‌ల‌ని, ఆకారాల‌ని గ‌మ‌నిస్తూ ఉండ‌డం చూస్తుంటే ఈ చిత్రం రెగ్యుల‌ర్ మూవీగా ఉండ‌ద‌ని, హాలీవుడ్ రేంజ్‌లో ఉంటుంద‌ని అర్ధ‌మ‌వుతుంది. వీడియోలో అల్లు అర్జున్ ఫేస్‌కి తగ్గట్లుగా 360 డిగ్రీలలో 3D స్కానింగ్ చేయించుకుంటున్నారు. దీని ప్రకారం ఆయన గెటప్‌ కూడా మారుతుందని తెలుస్తోంది.

Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

నిరుపేదలకు "బిగ్ రిలీఫ్"..!  నిరుపేదలకు "బిగ్ రిలీఫ్"..! 
తెలంగాణ రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి ద్వారా ఆరోగ్య విషయంలో నిరుపేదలకు బిగ్ రిలీఫ్ లభిస్తుందని షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు. నందిగామ మండలం...
పెరుగులో ఇది క‌లిపి తింటే ఏం జ‌రుగుతుందో తెలుసా .......
సీజేఐగా జస్టిస్ బీఆర్ గవాయ్ ప్రమాణం
సీఎంతో డిన్న‌ర్‌కి హాజ‌రైన నాగార్జున‌, అల్లు అర‌వింద్..
మే పుష్పం తళుక్కున మెరిసిన వేళ....
దేశమే మా ధ్యేయం
ప్రతి వారం 250 పాడి పశువుల యూనిట్ల గ్రౌండింగ్.... జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్