రోజు రోజుకు పెరుగుతున్న బీసీ సైన్యం…

ఇందిరానగర్‌లో బీసీ సేన మహిళా గ్రామ కమిటీ నియామకం…

రోజు రోజుకు పెరుగుతున్న బీసీ సైన్యం…

లోకల్ గైడ్:

చౌదరిగూడ మండలంలోని ఇందిరానగర్ గ్రామంలో బీసీ సేన మహిళా గ్రామ కమిటీని మండల మహిళా అధ్యక్షురాలు జయ శ్రీకాంత్ ఆధ్వర్యంలో నియమించారు.అదే విధంగా పరూఖ్‌నగర్ మండలంలోని దేవునిపల్లి గ్రామంలో బీసీ సేన జిల్లా యువత అధ్యక్షుడు శివ ముదిరాజ్  ఆధ్వర్యంలో నూతన గ్రామ కమిటీ నియమించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య నాయకులుగా హాజరైన జాతీయ బీసీ సేన అధ్యక్షుడు గౌరవనీయ బర్క కృష్ణ యాదవ్ మాట్లాడుతూ – “గ్రామ స్థాయిలో మహిళల నాయకత్వాన్ని ప్రోత్సహించడం ద్వారా బీసీ సామాజికవర్గంలో అద్భుతమైన మార్పు సాధ్యమవుతుంది. ప్రతి బీసీ మహిళ సమాజ మార్పుకు చైతన్యంగా నిలవాలి” అని అన్నారు.ఈ సందర్భంగా రంగారెడ్డి జిల్లా బీసీ సేన ఉపాధ్యక్షుడు గౌరవనీయ పసుపుల ప్రశాంత్ (షాద్‌నగర్) మాట్లాడుతూ – “ఇందిరానగర్ గ్రామ మహిళా కమిటీ బలంగా ఏర్పడటం ద్వారా బీసీ మహిళలు సామాజికంగా, రాజకీయంగా మరింత ముందుకు రావడానికి ఇది వేదికగా నిలుస్తుంది” అని అన్నారు.కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి జివ్వు సుధాకర్, యువజన జిల్లా కార్యదర్శి దేశముని శివ, జిల్లా కార్యదర్శి శ్రీనివాస్ యాదవ్, శాద్‌నగర్ నియోజకవర్గ అధ్యక్షుడు కత్తి చంద్రశేఖర్, భూషణ్ నరేష్, అసెంబ్లీ మహిళా అధ్యక్షురాలు బాస వరలక్ష్మి, ఫరూఖ్‌నగర్ మండల మహిళా అధ్యక్షురాలు జక్కుల జలజ,టౌన్ మహిళా అధ్యక్షురాలు కాటం భాగ్యలక్ష్మి,సుగిరి శారద గౌడ్, ప్రచార కార్యదర్శి చేరుకు మమత, మండల అధ్యక్షుడు మేకల వెంకటేష్, అసెంబ్లీ యువజన అధ్యక్షుడు పాలాది శ్రీనివాస్, నియోజకవర్గ కార్యవర్గ సభ్యులు మల్కాపురం రవి, చెన్న బాలరాజ్ పాల్గొన్నారు.అలాగే స్రవంతి, అందే పుష్పమ్మ, ప్రచార కార్యదర్శి ఏలూరు వసంత, హాజీపల్లి గ్రామ మహిళా అధ్యక్షురాలు సింగారం సరళ తదితర మహిళా నాయకులు పాల్గొని కమిటీకి అభినందనలు తెలిపారు.ఇందిరానగర్ గ్రామంలో బీసీ సేన మహిళా విభాగం బలపడటం ద్వారా, బీసీ హక్కుల సాధన మరింత దృఢంగా కొనసాగుతుందని నాయకులు విశ్వాసం వ్యక్తం చేశారు.

Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

సింహాచలం ప్రమాదం గురించి తెలిసి ఎంతో దిగ్భ్రాంతిగా అనిపించింది: పవన్ కళ్యాణ్ సింహాచలం ప్రమాదం గురించి తెలిసి ఎంతో దిగ్భ్రాంతిగా అనిపించింది: పవన్ కళ్యాణ్
లోకల్ గైడ్: విశాఖ జిల్లా సింహాచలం అప్పన్నస్వామి ఆలయం వద్ద అపశ్రుతి చోటు చేసుకున్నది. దర్శనానికి బారులు తీరిన భక్తులపై గోడ కూలిపోయింది. ఈ ఘటనలో ఇప్పటి...
యాప్‌లో ప్రకటన ఇచ్చి… ఆన్‌లైన్‌లో మోసానికి బలయ్యాడు!
అద్భుతమైన క్యాచ్ పట్టిన ఢిల్లీ క్యాపిటల్స్ ఫీల్డర్‌
‘రాధే శ్యామ్’ ద‌ర్శ‌కుడి దర్శకత్వంలో వ‌రుణ్ తేజ్ కొత్త చిత్రం
అంబేద్కర్ ఆశాల సాధనలో
గడపగడపకు జై బాబు, జై భీమ్, జై సంవిదాన్ నినాదం
నూతన భూ భారతి చట్టంతో రైతుల భూ సమస్యలకు పరిష్కారం