శివాలయం పునర్ నిర్మాణానికి 75వేల విరాళం అందజేసిన బండ్ల రాజశేఖర్ రెడ్డి

శివాలయం పునర్ నిర్మాణానికి 75వేల విరాళం అందజేసిన బండ్ల రాజశేఖర్ రెడ్డి

జోగులాంబ గద్వాల జిల్లా, (లోకల్ గైడ్): జిల్లా కేంద్రంలోని  నల్లకుంట శివాలయం పునర్నిర్మాణంలో భాగంగా గురువారం రమ్య ఇండస్ట్రీ అధినేత బండ్ల రాజశేఖర్ రెడ్డి  75,000 వేల రూపాయలు విరాళంగా చందాను చెక్కు రూపకముగా అందజేశారని నల్లకుంటశివాలయ కమిటీ చైర్మన్ పులిపాటి వెంకటేష్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బండ్లరాజశేఖర్ రెడ్డి ఆలయ కమిటీకి గుడి నిర్మాణం పూర్తయిన తర్వాత ప్రారంభం రోజు ఏదో రూపకంగా సహకారాలు అందిస్తానని హామీ ఇవ్వడం జరిగినదన్నారు. రాజశేఖర్ రెడ్డికు వారి కుటుంబ సభ్యులకు ధన్యవాదాలు తెలియజేశారు. నల్లకుంట శివాలయం పునర్నిర్మాణం రాతి కట్టడంతో కొనసాగుతుందన్నారు.  గతంలో విరాళాలు రాసిన చందాదారులు డబ్బులు ఇవ్వనివారు ఉంటే దయచేసి నగదు రూపకంగా, బ్యాంకు చెక్కు ద్వారా గాని ఇవ్వాలని కోరారు. విరాళం ఇవ్వాలనుకున్న వారు ఆలయ కమిటీకి తెలియజేస్తే మీ ఇంటికి వచ్చి స్వీకరిస్తామన్నారు. ఈ గుడి నిర్మాణం రాతి కట్టకంతో కొనసాగుతున్నదని, ఇందులో మీరు భాగస్తులై ఆ శివుని కృప పొందగలరని కోరారు. విరాల సేకరణలో నల్లకుంట శివాలయ కమిటీ చైర్మన్ పులిపాటి వెంకటేష్, ఉపాధ్యక్షులు గుమ్మడం గోపాల్, సోనీ వెంకటేష్, అల్లంపల్లి వెంకటేష్ పాల్గొన్నారు.

Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

 ఫలితాలను వెల్లడించిన త్రివేణి కృష్ణవేణి విద్యాసంస్థల డైరెక్టర్ గొల్లపూడి జగదీష్  ఫలితాలను వెల్లడించిన త్రివేణి కృష్ణవేణి విద్యాసంస్థల డైరెక్టర్ గొల్లపూడి జగదీష్
'పది'ఫలితాలలో త్రివేణి విజయభేరి 
సామ్రాజ్యవాద శక్తుల చేతిలో మగ్గుతున్న శ్రామికవర్గాన్ని రక్షించేది 'ఎర్ర జెండానే'
పని గంటలను పెంచనివ్వం: - సీఐటీయూ
శివాలయం పునర్ నిర్మాణానికి 75వేల విరాళం అందజేసిన బండ్ల రాజశేఖర్ రెడ్డి
జనగణనతో పాటు కులగణన చేస్తామని కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
అక్షయ తృతీయ నాడు ఒడిశా 51 లక్షల మంది రైతుల ఖాతాకు ₹1025 కోట్లు బదిలీ 
మారుమూల ఆదివాసి గ్రామాల్లో  మెరుగైన వైద్యం సౌకర్యవంతంగా చూడాలి.