గంజి నీళ్లు తాగితే బరువు తగ్గుతామా లేక పెరుగుతామా....
By Ram Reddy
On
లోకల్ గైడ్:
గంజి నీళ్లలో విటమిన్-ఈ, మెగ్నీషియం, ఫైబర్, జింక్, మాంగనీస్ వంటి అనేక ముఖ్యమైన పోషకాలు ఉంటాయి. ప్రతి రోజు ఒక గ్లాసు గంజి నీటిలో కొద్దిగా ఉప్పు కలిపి తాగితే బరువు నియంత్రణలో ఉండటమే కాకుండా శక్తి స్థాయి కూడా పెరుగుతుంది. ఇది జీర్ణ సమస్యల నివారణకు సహాయపడుతుంది. శరీరంలో పేరుకుపోయే కొవ్వును తగ్గించి, పోషకాలు శక్తివంతంగా గ్రహించేందుకు తోడ్పడుతుంది.గంజి నీరు ఆకలిని తగ్గించి హైడ్రేషన్‌ను మెరుగుపరచడంలో కీలకంగా పనిచేస్తుంది. ఇందులో కేలరీలు తక్కువగా ఉండటంతో బరువు తగ్గాలనుకునే వారికి ఎంతో ఉపయోగపడుతుంది.ఈ నీరు తాగడం వల్ల ఆకలి నియంత్రణలో ఉండి, అనవసరంగా తరచూ తినే అలవాటును దూరం చేసుకోవచ్చు. అంతేకాక, గంజి నీటిలో కొద్దిగా పెరుగు, ఉప్పు కలిపి తాగితే శరీరం ఆరోగ్యంగా, ఉల్లాసంగా అనిపిస్తుంది.
Tags:
About The Author
Related Posts
Post Comment
Latest News
19 May 2025 17:42:04
కరీంనగర్ : లోకల్ గైడ్:వివిధ కారణాలతో అనారోగ్యానికి గురై ఆర్థికంగా ఇబ్బందులు ప డ్డవారిని ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా ఆదుకుంటున్నామని సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి...
Comment List