దసరాకు కొమురవెల్లి రైల్వేస్టేషన్ ప్రారంభం........
లోకల్ గైడ్:
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో రైల్వే అభివృద్ధిని వేగవంతంగా కొనసాగిస్తున్నామని కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి తెలిపారు. బేగంపేట, కరీంనగర్, వరంగల్ స్టేషన్లను ఆధునికంగా అభివృద్ధి చేసిన ‘అమృత్ భారత్’ పథకం కింద ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.బేగంపేట రైల్వే స్టేషన్‌లో పూర్తిగా మహిళలు పని చేసే విధంగా ఏర్పాట్లు చేస్తున్నట్టు వెల్లడించారు. దేశవ్యాప్తంగా 1,300 రైల్వే స్టేషన్లను అభివృద్ధి చేయాలన్న కేంద్రం లక్ష్యంతో పనులు జరుగుతున్నాయని తెలిపారు. ప్రమాదాలను నివారించేందుకు ‘కవచ్’ టెక్నాలజీను ప్రవేశపెట్టినట్టు ఆయన వివరించారు.తెలంగాణలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయని, రూ. 80 వేల కోట్ల విలువైన ప్రాజెక్టులకు సంబంధించిన ప్రణాళికలు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు.దసరా రోజున కొమురవెల్లి రైల్వే స్టేషన్ ప్రారంభించనున్నట్టు, అలాగే ఎంఎంటీఎస్ రెండో దశను ప్రధానమంత్రి మోదీ ప్రారంభించారని, యాదగిరిగుట్ట వరకు ఎంఎంటీఎస్ విస్తరణకు చర్యలు తీసుకుంటున్నట్టు కిషన్ రెడ్డి చెప్పారు.
Comment List