వర్షాకాలంలో తలెత్తే సమస్యలకు నిర్మల్ పోలీస్ శాఖ సన్నద్ధత.
జిల్లా ఎస్పి డా.జి.జానకి షర్మిల.
నిర్మల్, లోకల్ గైడ్ :
రాబోవు వర్షాల ప్రభావంతో జిల్లా ప్రజలకు ఎలాంటి ప్రమాదం తలెత్తకుండా, పోలీస్ శాఖ పరంగా తగిన ఏర్పట్లతో ముందస్తుగా పకడ్బందీ చర్యలు నిమిత్తం గురువారం జిల్లా ఎస్పి డా.జి.జానకి షర్మిల సాయుద దళ ముఖ్య కార్యాలయం లో గల ఫ్లడ్ రిలీఫ్ కొరకు ఉంచిన సామగ్రిని తనిఖి చేశారు. జిల్లాలో భారీ వర్షాల కారణంగా కడెం, స్వర్ణ, గడ్డెన్న ప్రాజెక్టులు దాదాపు పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరు కునే అవకాశం ఉంటుందని. గత సవత్సరం గ్రామాల్లోని చెరువులు, కుంటలు నిండుకుండలా మారాయని అన్నారు .భారీ వర్షాలతో జిల్లాలని లోతట్టు ప్రాంతాలు జలమయం అయినపుడు వారిని కాపాడేందుకు జిల్లాలో ఎయిర్ బోర్డ్స్, లైవ్ జాకెట్స్, ట్యూబ్స్ రోప్ అన్నిటిని సిద్ధం చేయటం జరిగిందన్నారు. జిల్లాలో అనుకోని విపత్తులు ఏర్పడినప్పుడు ప్రాణహాని కలవకుండా వారిని సులువుగా కాపాడటం కోసం అన్ని చర్యలు తీసుకోవటం కోసం ముందస్తుగా సంబంధిత అధికారులతో తనిఖీ నిర్వహించటం జరిగింది. ఈ సందర్బంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ... నిర్మల్ జిల్లాలో అతి భారీ వర్షాల వల్ల వరదల్లో చిక్కుకున్న వారిని కాపాడేందుకు ఎయిర్ బోర్డ్స్, లైవ్ జాకెట్స్, ట్యూబ్స్ మరియు రోప్ వస్తువులు పోలీస్ శాఖ వారికి చాలా అవసరం కాబట్టి అట్టి వాటిపై ఈ నెలలో పోలీస్ సిబ్బంది కి నిష్ణాతుల చేత శిక్షణ ఇవ్వటం జరుగును అని చెప్పారు. గతంలో 70 మందికి శిక్షణ ఇవ్వటం జరిగింది. జిల్లా పోలీసు యంత్రాంగం ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంటుందని తెల్పినారు. వివిధ ప్రాంతాలలో చిక్కుకున్న వారిని పోలీస్ వారు వారి ప్రాణాన్ని పణంగా పెట్టి రోప్ తో, లైవ్ జాకెట్ తో రిస్క్ చేసి కాపాడటం కోసం ఈ శిక్షణ ఎంతో అవసరం అని సూచించారు. మన వద్ద ఉన్న ఎయిర్ బోర్డ్స్ సులువుగా, సిబ్బందికి కష్టం కలగకుండా వారిని కాపాడవచ్చును అన్నారు. గత సవత్సరం వచ్చిన వరదల నష్టాలను దృష్టిలో ఉంచుకుని మరియు రాబోవు వర్షాల దృస్ట్య అందరు పోలీసు అధికారులు సమాయత్తంగా ఉండాలని సూచించారు.ఈ కార్యక్రమంలో ఆర్ఐలు రాంనిరంజన్, రమేష్, అర్.ఎస్.ఐ లు రవి కుమార్ , రాజ శేఖర్, సాయి కృష్ణ, స్పెషల్ పార్టీ సిబ్బంది శివంగి టీం తదితరులు పాల్గొన్నారు
Comment List