ఉగ్ర‌వాదులు భార‌త్ లోకి చొర‌బడేందుకు య‌త్నం....

ఉగ్ర‌వాదులు భార‌త్ లోకి చొర‌బడేందుకు య‌త్నం....

లోక‌ల్ గైడ్ : 
ఆపరేషన్ సిందూర్ ఉద్ధమంగా కొనసాగుతున్న సమయంలో, పాకిస్థాన్ పెద్ద సంఖ్యలో ఉగ్రవాదులను భారత దేశంలోకి చొరబాటుకు ప్రయత్నించింది. మే 8వ తేదీన సుమారు 45-50 మంది ఉగ్రవాదులను అంతర్జాతీయ సరిహద్దులు దాటించి భారత్‌లోకి పంపేందుకు పాక్ బలగాలు భారీ షెల్లింగ్‌తో కూడిన యత్నాన్ని చేసింది. ఈ విషయాన్ని బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ ధృవీకరించింది.బీఎస్ఎఫ్ డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ జనరల్ ఎస్.ఎస్. మండ్ ఓ ఆంగ్ల వార్తా సంస్థతో మాట్లాడుతూ, “ఉగ్రవాదుల చొరబాటు ప్రయత్నంపై ముందస్తుగా మాకు సమాచారం అందింది. వారి కోసం మా బలగాలు అప్రమత్తంగా ఉన్నారు. సరిహద్దు దాటే ప్రయత్నం చేసిన వెంటనే మేము వారిపై విరుచుకుపడ్డాము. వారిలో దాదాపు 45-50 మంది ఉగ్రవాదులు ఉండగా, మా గట్టిదాడులతో వారు వెనక్కి వెళ్లిపోయారు. వారిని సాయించేలా పాక్ బలగాలు తమ పోస్టుల నుంచి కాల్పులు ప్రారంభించగా, మేము అత్యంత ఖచ్చితంగా ప్రతీకారం తీర్చాము,” అని వెల్లడించారు.ఈ ఎదురుకాల్పుల్లో పాక్ ఉగ్రవాదుల బంకర్లు, ఆయుధాలు ధ్వంసమయ్యాయని, తద్వారా వారికి గట్టి బుద్ధి చెప్పామన్నారు. “వారు మరోసారి ప్రయత్నిస్తే పదింతల శక్తితో తిప్పికొడతాం. మా మహిళా జవాన్లు కూడా పురుష జవాన్లతో సమానంగా వీరోచితంగా పోరాడుతున్నారు. వారిని చూస్తే మాకు గర్వంగా ఉంది,” అని డీఐజీ మండ్ పేర్కొన్నారు.ఇక, మే 8 రాత్రి 11 గంటల సమయంలో జమ్మూకశ్మీర్‌లోని సాంబ జిల్లాలో అంతర్జాతీయ సరిహద్దులను దాటి చొరబాటుకు వచ్చిన ఉగ్రవాదులను కూడా బీఎస్ఎఫ్ సమర్థవంతంగా వెనక్కి తోసేసింది. బుధవారం పూంచ్‌లోని బ్రిగేడ్ హెడ్ క్వార్టర్‌ను జమ్మూకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ సందర్శించి, ఆర్మీ మరియు బీఎస్ఎఫ్ సిబ్బందిని అభినందించారు.

Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

అండర్‌-19 జట్టుకెప్టెన్‌గా ఆయుష్ మాత్రే, వైస్ కెప్టెన్‌గా అభిజ్ఞాన్ కుండు అండర్‌-19 జట్టుకెప్టెన్‌గా ఆయుష్ మాత్రే, వైస్ కెప్టెన్‌గా అభిజ్ఞాన్ కుండు
లోక‌ల్ గైడ్ :భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఇంగ్లాండ్ పర్యటన కోసం అండర్-19 జట్టును అధికారికంగా ప్రకటించింది. ఈ పర్యటన జూన్ 24 నుంచి జూలై...
వర్షాకాలంలో తలెత్తే సమస్యలకు నిర్మల్ పోలీస్ శాఖ సన్నద్ధత. 
రైతులు ఎలాంటి ఆందోళన చెందవద్దు.
రాబోయే స్థానిక సంస్థల  గెలుపు లక్ష్యంగా పార్టీ శ్రేణులు అందరు కలిసికట్టుగా పనిచేయాలి
టెస్ట్ జట్టుగా చరిత్రలో దిగజారిన బంగ్లాదేశ్
ఉగ్ర‌వాదులు భార‌త్ లోకి చొర‌బడేందుకు య‌త్నం....
'డ్రాగన్' చిత్రంలో కీలక పాత్రలో విద్యాబాలన్ – మరోసారి నందమూరి కుటుంబంతో జత