ఏకరూప దుస్తులు నాణ్యంగా తయారు చేయాలి:

 జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్

ఏకరూప దుస్తులు నాణ్యంగా తయారు చేయాలి:

నిర్మల్ : లోకల్ గైడ్ :
ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు అందించే యూనిఫామ్లు (ఏకరూప దుస్తులు) నాణ్యంగా ఉండేలా చూడాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం పట్టణంలోని ఈద్గాం, మంజులాపూర్‌లో ఏర్పాటు చేసిన యూనిఫాం తయారీ కేంద్రాలను ఆమె తనిఖీ చేశారు.  ఈ సందర్భంగా దుస్తుల కుట్టు నాణ్యతను, తయారీ విధానాన్ని సమీక్షించిన కలెక్టర్... విద్యార్థులకు ఇవ్వబోయే దుస్తులు కచ్చితంగా కొలతలకు తగినట్లుగా ఉండాలని అన్నారు. పాఠశాలలు ప్రారంభం అయ్యేలోపు విద్యార్థులకు యూనిఫామ్లు అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.దుస్తుల తయారీదారులకు పలు సూచనలు చేసిన కలెక్టర్... నాణ్యత విషయంలో ఏమాత్రం తేడా ఉండకూడదన్నారు. ఈ పరిశీలనలో డీఆర్‌డిఓ విజయలక్ష్మి, మెప్మా పీడీ సుభాష్, విద్యాశాఖ అధికారులు లింబాద్రి, ప్రవీణ్, తహసీల్దార్ రాజు, తదితరులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

ఇవి ఉడకబెట్టి  తింటే ఏం జ‌రుగుతుందో తెలుసా....... ఇవి ఉడకబెట్టి తింటే ఏం జ‌రుగుతుందో తెలుసా.......
పండుగలు లేదా శుభ కార్యాల సమయంలో చాలా మంది ప్రత్యేకంగా గారెలు తయారుచేస్తుంటారు. మొక్కజొన్న, బొబ్బర్లు, పెసలు, మినుములు వంటివి ఉపయోగించి గారెలను వేస్తారు. కొన్ని ప్రాంతాల్లో...
పదవి విరమణ అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది 
బీజేపీ నాయకుల ర్యాలీ 
పొగాకు కు దూరంగా ఉండండి-ఆరోగ్యంగా జీవించండి 
రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల ఏర్పాట్లను చేయాలి 
వరిధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలి
జూన్ రెండో వారం నుంచి విస్తారంగా వ‌ర్షాలు........