శిక్షణలో సర్వే అంశాలను క్షుణ్ణంగా తెలుసుకోవాలి
--హనుమకొండ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య.
హనుమకొండ (లోకల్ గైడ్):
లైసెన్స్ సర్వేయర్ శిక్షణా కార్యక్రమంలో సర్వేకు సంబంధించిన అంశాలను క్షుణ్ణంగా తెలుసుకోవాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్య అన్నారు.మంగళవారం హనుమకొండ జిల్లా హసన్ పర్తి మండల కేంద్రంలోని సాంకేతిక శిక్షణాభివృద్ధి కేంద్రం (టిటిడిసి)లో జిల్లా సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ ఆధ్వర్యంలో లైసెన్స్ సర్వేయర్లకు నిర్వహిస్తున్న శిక్షణ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ పరిశీలించారు. శిక్షణ కార్యక్రమంలో సర్వే నిర్వహణకు సంబంధించిన వివిధ అంశాలపై నిర్వహిస్తున్న బోధనా తరగతులను జిల్లా కలెక్టర్ పరిశీలించారు. బోధనా అంశాలను కలెక్టర్ విన్నారు. శిక్షణార్థులతో కలెక్టర్ సంభాషించారు. శిక్షణ కార్యక్రమం గురించి శిక్షణార్ధులను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. శిక్షణకు సంబంధించిన మెటీరియల్ను కలెక్టర్ చేతుల మీదుగా అభ్యర్థులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ప్రావీణ్య మాట్లాడుతూ లైసెన్స్ సర్వేయర్లకు 50 రోజులపాటు నిర్వహించే శిక్షణ కాలంలో సర్వేకు సంబంధించిన అన్ని అంశాలపై పట్టు సాధించే విధంగా శిక్షణా కార్యక్రమాన్ని రూపొందించినట్లు తెలిపారు. సర్వేకు సంబంధించిన అంశాలపై శిక్షణార్థులకు 50 రోజుల పాటు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. శిక్షణ కార్యక్రమం అనంతరం అభ్యర్థులకు పరీక్ష నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఎలాంటి భూవివాదాలు పరిష్కరించేందుకు ప్రభుత్వం భూభారతి చట్టాన్ని తీసుకువచ్చింది అన్నారు. భూ వివాదాలు లేకుండా ఉండాలంటే ఫీల్డ్ సర్వే చేయడం ద్వారా సాధ్యమవుతుందన్నారు. శిక్షణ అనంతరం పరీక్షను నిర్వహించి ప్రతిభ కనబరిచిన వారికి భూభారతి సర్వే చేసేందుకు అవకాశం లభిస్తుందన్నారు. భూ వివాదాల పరిష్కారానికి సర్వే రిపోర్ట్ ఎంతో ప్రాముఖ్యత ఉంటుందన్నారు. శిక్షణార్థుల హాజరు అన్ని రోజులపాటు అటెండెన్స్ పక్కాగా తీసుకోవాలన్నారు. శిక్షణ అనంతరం క్షేత్రస్థాయిలో బాగా పనిచేయాలని సూచించారు. ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే వాటిని గురించి నివృత్తి చేసుకోవాలన్నారు. సర్వే సంబంధించిన అన్ని విషయాలను తెలుసుకునే విధంగా తరగతులను మిస్ చేసుకోవద్దని అన్నారు. శిక్షణ తరగతులను సరిగ్గా వింటేనే ప్రాక్టికల్ గా చేసేందుకు ఉపయోగపడుతుందన్నారుఈ సందర్భంగా ల్యాండ్ సర్వే రికార్డ్స్ ఏడి శ్రీనివాసులు, ఇతర అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.
Comment List