మానవసేవలో తరిస్తున్న
నర్సులు అభినందనీయులు
ప్రతి ఒక్కరూ
సోదరి అంటారు
కానీ అలా చూసే వాళ్ళు
చాలా అరుదు.
పంచిన ప్రేమ
కొండంత ఐన
గోరంత కూడా
పొందలేని జీవితం
కట్టుకున్నవారు
కన్న వారు
స్నేహితులు
బంధువులు
అయినా
చేయలేరు
మా సేవలు
మనసులో బాధలు
గుండెలో బరువులు
జీవితంలో బాధ్యతలు
ఉక్కిరి బిక్కిరి చేసినా
చిరునవ్వు మోముపై
చెరగనివ్వము క్షణమైనా
అందాలూ, ఆడంబరాలు
సింగారాలు, సోకులు
ప్రతి స్త్రీకి అందాన్నిస్తాయి
వాటికీ మేము
ఆమడ దూరం
కులం, మతం
వయసు, రోగము
మనిషి, మనసు
ఆస్థి పాస్తులతో
సంబంధం లేక
మనిషిని మనిషిగా
గౌరవించి ప్రేమించి
ప్రతి వ్యక్తికీ సేవ చేసే
భాగ్యం మాత్రం మాది
వ్యక్తిత్వం మా సొంతం
సేవా జీవితంలో
అడ్డంకులు ఎన్నో
అవరోధాలు ఎన్నో
సంఘర్షణలు ఎన్నో
అంతర్మధనం ఎంతో
ఐనా మానవ సేవ
మాధవ సేవగా తలచి
ఆత్మ తృప్తిని పొందే
గొప్ప అనుభూతి
ఎన్నడు మా సొంతం ...
అందుకే
కన్నీటిని
కష్టాలని
బాధలను
చిరునవ్వుతో కప్పి
త్యాగాల పరంపరలో
ప్రాణాలకు తెగించి
ఆనందిస్తాము సేవలో
ప్రార్ధించే పెదవుల
కన్నా సహాయం చేసే
చేతులే మిన్న అన్న
సూక్తి యే
నర్సులకు సూర్తి
నేదునూరి కనకయ్య
అధ్యక్షులు
సామాజిక ఆర్థిక అధ్యయన వేదిక
అధ్యక్షులు తెలంగాణ ఎకనామిక్ ఫోరం కరీంనగర్ 9440245771
Comment List