హెల్త్, ఎడ్యుకేషన్, న్యూట్రిషన్, సానిటేషన్ లపై ప్రత్యేక దృష్టి పెట్టాలి,

జిల్లా కలెక్టర్ అండ్ మెజిస్ట్రేట్ అద్వైత్ కుమార్ సింగ్

హెల్త్, ఎడ్యుకేషన్, న్యూట్రిషన్, సానిటేషన్ లపై ప్రత్యేక దృష్టి పెట్టాలి,

మహబూబాబాద్ జిల్లా  (లోకల్ గైడ్)

హెల్త్,ఎడ్యుకేషన్, న్యూట్రిషన్, సానిటేషన్ లపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు, జిల్లా కలెక్టర్ మంగళవారం మండల ప్రత్యేక అధికారులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు,ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత వారం రోజుల నుండి మండల స్థాయి ప్రత్యేక అధికారులకు ఎడ్యుకేషన్, హెల్త్, సానిటేషన్, న్యూట్రీషలపై ప్రత్యేక కార్యచరణ రూపొందించి క్షేత్రస్థాయిలో పర్యటించేందుకు ఆదేశాలు జారీ చేశామని, 
అందులో భాగంగానే రానున్న రెండు మూడు రోజుల్లో పాఠశాలలు పునర్ ప్రారంభం నేపథ్యంలో జిల్లాలోని అన్ని విద్యాసంస్థలు, వసతి గృహాలు లలో ప్రత్యేక సానిటేషన్ నిర్వహించాలని అందుకు క్షేత్రస్థాయిలో అధికారులు పర్యటించి  పై అంశాలను పరిశీలించి తనిఖీ చేయాలని ఆదేశించారు,ప్రభుత్వం పిల్లలకు అందించే విద్యలో అత్యున్నత ప్రమాణాలతో విద్య బోధనలు అందించాలని, అందుకు పరిసర ప్రాంతాలలో ఆహ్లాదకరమైన వాతావరణం ఉండే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు,వాతావరణం లో మార్పులు వస్తున్న నేపథ్యంలో సీజనల్ వ్యాధులు డెంగ్యూ, మలేరియా, చికెన్ గున్య, విషజ్వరాలు ప్రబలకుండా గ్రామాలు ,పట్టణ ప్రాంతాలలో ప్రత్యేక సానిటేషన్ డ్రైవ్ నిర్వహించి ముందస్తు వైద్య శిబిరాలను నిర్వహించాలని సమస్యత్మక ప్రాంతాలను గుర్తించి వారికి అంటువ్యాధులు ప్రబలకుండా అవగాహన కల్పించి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు,అంగన్వాడి కేంద్రాల ద్వారా చిన్న పిల్లలకు గర్భిణీలకు, బాలింతలకు అందిస్తున్న బలవర్ధకమైన న్యూట్రిషన్ ఫుడ్ పక్కాగా అమలు చేయాలని నూతనంగా తెలిపిన సూచనల ప్రకారం మెనూ పాటించాలన్నారు,జిల్లాలోనీ (18) లలో ప్రత్యేక అధికారులు ఇప్పటికే రూపొందించిన ప్రణాళిక ప్రకారం విద్యాసంస్థలు, వసతి గృహాలు, అంగన్వాడి కేంద్రాలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్, తదితర ప్రదేశాలలో జరుగుతున్న శానిటేషన్లను పరిశీలించి, సిద్ధపరుస్తున్నారన్నారు.

Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

సచిన్ బాటలో రుతురాజ్ గైక్వాడ్... సచిన్ బాటలో రుతురాజ్ గైక్వాడ్...
భారత యువ బ్యాటర్, చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ మరోసారి జాతీయ జట్టులో స్థానం సంపాదించేందుకు కృషి చేస్తున్నాడు. ప్రస్తుతం టీమిండియాలోకి అవకాశం లభించకపోవడంతో...
బీజేపీ ప్రభుత్వంలో అవినీతి రహిత పాలన 
మారెమ్మ అమ్మ  వారిని దర్శించుకున్న ఎమ్మెల్యే 
 రూ.3వేలు దాటిన యూపీఐ చెల్లింపులపై ఛార్జీలు..? 
"సూర్య 46"
హైదరాబాద్ వాసులకు శుభవార్త!
రాష్ట్రంలో మళ్లీ కురుస్తున్న వానలు..