ఈనెల 27 ,28, 29 న కడపలో జరిగే మహానాడు ను విజయవంతం చేయండి.

ఈనెల 27 ,28, 29 న కడపలో జరిగే మహానాడు ను విజయవంతం చేయండి.

నల్లగొండ లోకల్ గైడ్.

నకిరేకల్ నియోజకవర్గ నార్కట్ పల్లి మండల కేంద్రంలో తెలుగుదేశం పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం మంగళవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి  నకిరేకల్ నియోజకవర్గ నాయకులు రుద్రవరం యాదగిరి   మాట్లాడారు .ఈనెల 27 ,28 ,29, కడపలో జరిగే మహానాడు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. నకిరేకల్ నియోజకవర్గం నుండి పెద్ద ఎత్తున తెలంగాణ రాష్ట్రంలోనే అతి అత్యధిక జన సమీకరణతో వెళ్లాలని ఆయన అన్నారు. మహానాడు కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు పండుగ రోజు అని ఈ పండుగను ఉమ్మడి తెలుగు రాష్ట్రాలు ఘనంగా నిర్వహిస్తారని ఆయన అన్నారు. ఏదైతే ఎన్టీ రామారావు స్థాపించిన తెలుగుదేశం పార్టీ 43 సంవత్సరాలు దాటిన సందర్భంగా నిర్వహించే మహానాడుకు తెలంగాణ రాష్ట్రం నుండి , నక రికల్ నియోజకవర్గ నలుమూలల నుండి 2000 మందికి తగ్గకుండా తీసుకెళ్తామని రుద్రవరం యాదగిరి  ముఖ్య కార్యకర్తలు కోరారు.  నార్కెట్పల్లి మండలంలో తెలుగుదేశం పార్టీ జెండా దిమ్మెలు నూతన రంగులతో ముస్తాబైనవి కావున 26వ తేదీ రోజు పల్లె పల్లెకు తెలుగుదేశం కార్యక్రమాన్ని నిర్వహించి కార్యకర్తలలో ఉత్సాహాన్ని నింపుతామని ఆయన అన్నారు .ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు బంధారపు శివ, పార్లమెంటు మాజీకార్యదర్శి లింగాల యాదయ్య, మాజీ ప్రధాన కార్యదర్శి చింతరాజు, ఎస్ సి సెల్ డిపార్ట్మెంట్ జిల్లా ఉపాధ్యక్షులు చింత లక్ష్మణ్, చేన్నారపు సత్తయ్య, లింగాల నరేందర్ తదితరులుపాల్గొన్నారు

Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

లక్ష్మీ దేవి ఆశీస్సుల కోసం మీ పర్సులో ఉంచుకోవాల్సిన 5 ముఖ్యమైన వస్తువులు లక్ష్మీ దేవి ఆశీస్సుల కోసం మీ పర్సులో ఉంచుకోవాల్సిన 5 ముఖ్యమైన వస్తువులు
లక్ష్మీ దేవి ఆశీస్సులు పొందడానికి మీ పర్సులో ఉంచుకోవాల్సిన 5 ముఖ్యమైన వస్తువులను కనుగొనండి. ఈ వస్తువులు మీ జీవితంలో శ్రేయస్సును ఎలా ఆకర్షిస్తాయో మరియు శుభ...
వరంగల్ రైల్వే స్టేషన్ ను ప్రజలకు అంకితం చేసిన మోడీ
అర్హత కలిగిన పేద కుటుంబాలకు మాత్రమే ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలి
జీలుగ పంటతో భూసారాన్ని పెంచండి
చేయూత పెన్షన్లను సక్రమంగా పంపిణీ చేయాలి.
శిల్పారామంలో ప్రపంచ సుంద‌రీమ‌ణుల సంద‌డి 
అండర్‌-19 జట్టుకెప్టెన్‌గా ఆయుష్ మాత్రే, వైస్ కెప్టెన్‌గా అభిజ్ఞాన్ కుండు