జీలుగ పంటతో భూసారాన్ని పెంచండి

- అలంపూర్ మార్కెట్ యార్డ్ చైర్మన్ దొడ్డప్ప.

జీలుగ పంటతో భూసారాన్ని పెంచండి

అలంపూర్, లోకల్ గైడ్ :
జీలుగ పంటతో భూసారాన్ని పెంచాలని అలంపూర్ మార్కెట్ యార్డ్ చైర్మన్ దొడ్డప్ప అన్నారు. గురువారం  అయిజ పట్టణంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (సింగిల్ విండో) ఆవరణలో జీలుగ విత్తనాల విక్రయాన్ని పిఎసిఎస్ చైర్మన్ పోతుల మధుసూదన్ రెడ్డి తో కలిసి అలంపూర్ మార్కెట్ యార్డ్ చైర్మన్ దొడ్డప్ప  ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పొలాల్లో భూసారాన్ని పెంచేందుకు  ప్రభుత్వం సబ్సిడీతో జీలుగా సరఫరా చేస్తోందని క్వింటాల్ జీలుగ విత్తనాల ధర బహిరంగ మార్కెట్లో క్వింటాల్ కు  రూ.14250 ఉండగా 50 శాతం సబ్సిడీతో రూ: 7125 లకు అందజేస్తుందన్నారు. ప్రస్తుతం 30 కేజీల జీలుగ విత్తనాల ధర సబ్సిడీతో రూ:2137.50 రైతులకు అందిస్తామన్నారు. జీలుగ విత్తనాలు కావలసిన రైతులు తమ పట్టాదారు పాసుబుక్కు, ఆధార్ జిరాక్స్ కాపీలతో స్థానిక వ్యవసాయ మార్కెట్ యార్డ్ లోని రైతు వేదికలో అధికారులను సంప్రదించాలన్నారు. రెండున్నర ఎకరాలకు ఒక 30 కేజీల బస్తా చొప్పున ఇవ్వనట్లు, రైతు వేదికలో పర్మిట్ పొంది సింగిల్ విండో కార్యాలయంలో నగదు చెల్లించి జీలుగ విత్తనాలను తీసుకెళ్లాలని వారు సూచించారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి జనార్ధన్ వ్యవసాయ విస్తరణ అధికారులు లోకరాజ్, సతీష్ కార్యదర్శి మల్లేష్ కాంగ్రెస్ నాయకుడు బసవరాజ్ వివిధ గ్రామాల రైతులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

లక్ష్మీ దేవి ఆశీస్సుల కోసం మీ పర్సులో ఉంచుకోవాల్సిన 5 ముఖ్యమైన వస్తువులు లక్ష్మీ దేవి ఆశీస్సుల కోసం మీ పర్సులో ఉంచుకోవాల్సిన 5 ముఖ్యమైన వస్తువులు
లక్ష్మీ దేవి ఆశీస్సులు పొందడానికి మీ పర్సులో ఉంచుకోవాల్సిన 5 ముఖ్యమైన వస్తువులను కనుగొనండి. ఈ వస్తువులు మీ జీవితంలో శ్రేయస్సును ఎలా ఆకర్షిస్తాయో మరియు శుభ...
వరంగల్ రైల్వే స్టేషన్ ను ప్రజలకు అంకితం చేసిన మోడీ
అర్హత కలిగిన పేద కుటుంబాలకు మాత్రమే ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలి
జీలుగ పంటతో భూసారాన్ని పెంచండి
చేయూత పెన్షన్లను సక్రమంగా పంపిణీ చేయాలి.
శిల్పారామంలో ప్రపంచ సుంద‌రీమ‌ణుల సంద‌డి 
అండర్‌-19 జట్టుకెప్టెన్‌గా ఆయుష్ మాత్రే, వైస్ కెప్టెన్‌గా అభిజ్ఞాన్ కుండు