ఐపీఎల్ ఫైనల్లో ఆపరేషన్ సింధూర్‌కు నివాళి...
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ఫైనల్ జూన్ 3న అహ్మదాబాద్‌లో జరగనుంది. ఈ సందర్భంగా త్రివిధ దళాధిపతులను ఆహ్వానించినట్టు బీసీసీఐ వెల్లడించింది. ఇటీవల పెహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత రక్షణ దళాలు చేపట్టిన "ఆపరేషన్ సింధూర్" విజయవంతమైన సంగతి తెలిసిందే. ఈ ఆపరేషన్‌లో పాకిస్తాన్‌లోని ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేశారు. ఆ సమయంలో ఐపీఎల్ మ్యాచ్‌లను కూడా రద్దు చేసిన విషయం తెలిసిందే.ఇప్పుడు ఐపీఎల్ ప్లే ఆఫ్స్ దశ ప్రారంభం కానుంది. ఇవాళ తుది లీగ్ మ్యాచ్ జరుగుతుంది. గురువారం "క్వాలిఫయర్ 1" మ్యాచ్ జరగనుంది. ఐపీఎల్ ఫైనల్ సందర్భంగా ఆపరేషన్ సింధూర్‌లో చూపిన సాహసం, ధైర్యానికి నివాళిగా బీసీసీఐ ఓ ప్రత్యేక కార్యక్రమం చేపట్టనుంది.ఈ కార్యక్రమంలో భాగంగా ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్‌లకు చెందిన టాప్ అధికారులను మరియు సైనికులను ఐపీఎల్ ఫైనల్‌కు ఆహ్వానించింది. ఆపరేషన్ సింధూర్ విజయాన్ని సెలబ్రేట్ చేయడమే లక్ష్యంగా ఉన్నట్లు బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా తెలిపారు.
Comment List