నకిలీ విత్తనాల అమ్మితే డీలర్లపై కఠిన చర్యలు తప్పవు
•పలు షాపులలో తనిఖీలు
పోలీస్ వ్యవసాయ శాఖ అధికారులు.
డోర్నకల్(లోకల్ గైడ్):నరసింహుల పేట
నకిలీ విత్తనాలు అమ్మిన వారి పై కఠిన చర్యలు ఉంటాయని మండల వ్యవసాయ శాఖ అధికారి వినయ్ కుమార్. ట్రైనింగ్ ఎస్సై షేక్ ఖాదర్ భాష అన్నారు. మండల కేంద్రంతో పాటు వివిధ గ్రామాలలో పలు ఫర్టిలైజర్.షాపులలో మంగళవారం తనిఖీలు నిర్వహించి అనంతరం వారు మాట్లాడుతూ రాబోయే వర్షాకాల సీజన్ కి రైతులు పత్తి, మిర్చి పంట సాగు కోసం విత్తనాలు కొనుగోలు చేయుటకు రైతులు మండలంలోని గుర్తింపు పొందిన డీలర్ వద్దనే కొనుగోలు చేయాలని, నకిలీ డీలర్ల వద్ద విత్తనాలు కొనుగోలు చేస్తే పంటకు సరైన దిగుబడి రాక తీవ్రంగా నష్టం ఏర్పడే అవకాశం ఉందని అన్నారు.
రైతులు విత్తనాలు కొనుగోలు చేసే ముందు జాగ్రత్త తీసుకోవాలని, నకిలీ విత్తనాలను అరికట్టడంలో వ్యవసాయ శాఖ పోలీస్ సమన్వయంతో పని చేస్తుందని అన్నారు. రైతులకు విత్తనాల పై ఏమైనా అనుమానాలు ఉంటే వ్యవసాయ శాఖ అధికారుల్ని సంప్రదించి వారి సలహా తీసుకోవాలని సూచించారు. నకిలీ విత్తనాల ఎవరైనా అమ్ముతున్నట్లు సమాచారం ఉంటే పోలీసులకు తెలియపరచాలని కోరారు. ఈ కార్యక్రమంలో పలు షాపుల డీలర్లు తోపాటు తదితరులు పాల్గొన్నారు.
Comment List