లాస్ ఏంజెలెస్‌లో అద‌నంగా 2,000 మంది  నేష‌న‌ల్ గార్డ్స్ మోహ‌రింపు....

లాస్ ఏంజెలెస్‌లో అద‌నంగా 2,000 మంది  నేష‌న‌ల్ గార్డ్స్ మోహ‌రింపు....

లోక‌ల్ గైడ్ : 
అక్రమ వలసదారుల అరెస్టుల నేపథ్యంలో లాస్ ఏంజెలెస్‌లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పరిస్థితిని నియంత్రించేందుకు అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారీ భద్రతా చర్యలకు సిద్ధమయ్యారు. అదనంగా 2,000 మంది నేషనల్ గార్డులను లాస్ ఏంజెలెస్కు పంపించాలని ఆయన అధికారులకు ఆదేశించారు.ఈ విషయాన్ని పెంటగాన్ ప్రతినిధి సీన్ పార్నెల్ ధృవీకరించారు. “అధ్యక్షుడి ఆదేశాల మేరకు రక్షణశాఖ లాస్ ఏంజెలెస్‌కి అదనంగా 2వేల నేషనల్ గార్డ్స్‌ను మోహరిస్తోంది,” అని ఆయన ఒక ప్రకటనలో తెలిపారు. దీనికి ముందు ఇప్పటికే నగరంలో కొనసాగుతున్న నిరసనలపై నియంత్రణ కోసం 700 మంది మెరైన్లు మోహరించబడ్డారు. వీరి బాధ్యతగా ఇమిగ్రేషన్ అధికారులను మరియు సంబంధిత ఆస్తులను రక్షించడమని పేర్కొన్నారు.
ఇక ట్రంప్ తీసుకున్న ఈ చర్యలపై కాలిఫోర్నియా గవర్నర్ గవిన్ న్యూసమ్ తీవ్రంగా స్పందించారు. “ప్రజాస్వామ్యాన్ని కాపాడే బాధ్యత కలిగిన మెరైన్లను, ఇప్పుడు సొంత ప్రజలపై మోహరించడం సరికాదు,” అని ఆయన ట్వీట్‌లో పేర్కొన్నారు. గార్డ్స్‌కి సరైన ఆహారం, నీరు, విశ్రాంతి స్థలం కల్పించకుండా నగరంలోకి పంపించడం తప్పు అని న్యూసమ్ ఆరోపించారు. ట్రంప్ తన సైనికులతో వ్యవహరించే తీరును ఆయన తీవ్రంగా విమర్శించారు.

Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

వ‌ర్షాకాలంలో బొప్పాయి పండ్ల‌ను త‌ప్ప‌నిస‌రిగా తినాల్సిందే.. ఎందుకో తెలుసా..? వ‌ర్షాకాలంలో బొప్పాయి పండ్ల‌ను త‌ప్ప‌నిస‌రిగా తినాల్సిందే.. ఎందుకో తెలుసా..?
బొప్పాయి పండ్లు దాదాపు అన్ని కాలాల్లోనూ అందుబాటులో ఉంటాయి. అయితే, వర్షాకాలంలో వీటిని తినడం మరింత మేలంటూ వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ఎందుకంటే ఈ సీజన్‌లో జీర్ణ...
సృష్టిలో మనిషి ఒంటరి కాదు  
తెలంగాణ‌కు ఐదు రోజుల పాటు వ‌ర్షాలు
యుద్ధ హెలికాప్టర్‌లో సాంకేతిక లోపం.. పఠాన్‌కోట్‌లో ఎమర్జెన్సీ ల్యాండింగ్‌ ....
మృతుని కుటంబానికి ఆర్థిక సహాయం
మృతుని కుటుంబానికి అండగా గ్రామస్థులు
పదిమంది పేకాట రాయుళ్లు అరెస్ట్....