పదిమంది పేకాట రాయుళ్లు అరెస్ట్....
76000 నగదు, కారు, రెండు ద్విచక్ర వాహనాలు, 12 సెల్ ఫోన్లు స్వాధీనం
By Ram Reddy
On
నిజామాబాద్ : (లోకల్ గైడ్) పేకాట ఆడుతున్న పది మంది జూదారులను పట్టుకొని అరెస్ట్ చేసినట్లు ఆరవ టౌన్ ఎస్ఐ వెంకటరావు తెలిపారు.ఆయన వెల్లడించిన వివరాల ప్రకారం నిజామాబాద్ రూరల్ పరిధిలోనిశాస్త్రి నగర్ గ్రామ శివారులో కొంత మంది పేకాట ఆడుతున్నట్లు విశ్వసనీయ సమాచారం మేరకు స్థావరం పై దాడి చేసి 10 మందిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు.వారి నుంచి రూ 76000 నగదు, కారు, రెండు ద్విచక్ర వాహనాలు, 12 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. వారిపై కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ వెంకటరావు తెలిపారు.
Tags:
About The Author
Related Posts
Post Comment
Latest News
13 Jun 2025 18:33:55
స్వాగతం పలికిన అదనపు కలెక్టర్లు, అధికారులు..
Comment List