మొటిమలు వచ్చే వారు అశాంతి పడకండి – ఇంట్లోనే సహజ పరిష్కారాలు!

మొటిమలు వచ్చే వారు అశాంతి పడకండి – ఇంట్లోనే సహజ పరిష్కారాలు!

మొటిమలు అనేవి సాధారణంగా యుక్త వయస్సులో ప్రారంభమవుతాయి. ఒక్కసారి మొటిమలు వచ్చిన తర్వాత అవి సులభంగా పోవు. కొంతమందికి తీవ్రమైన స్థాయిలో మొటిమలు వస్తే, మరికొంతమందికి తక్కువగా వస్తాయి. ముఖ్యంగా చర్మంలోని తైల గ్రంథులు అధికంగా నూనెను ఉత్పత్తి చేస్తే, అదే నూనె పక్కన ఉన్న మురికి, మృతకణాలతో కలిసి మొటిమలకు కారణమవుతుంది. ఈ సమయంలో ‘పి.అక్ని’ అనే బ్యాక్టీరియా కీలకపాత్ర పోషిస్తుంది.

కానీ ఖరీదైన ట్రీట్‌మెంట్ అవసరం లేకుండానే, మన ఇంట్లోనే ఉన్న కొన్ని సహజ పదార్థాలతో మొటిమల సమస్యను తగ్గించుకోవచ్చు. వాటిలో కొన్ని ప్రధాన చిట్కాలు ఇక్కడ తెలుసుకుందాం:
1. టీ ట్రీ ఆయిల్ – బ్యాక్టీరియా శత్రువు

టీ ట్రీ ఆయిల్‌లో యాంటీ బాక్టీరియల్, యాంటీ ఇన్‌ఫ్లామేటరీ లక్షణాలు ఉంటాయి. ఇది మొటిమలకు కారణమయ్యే బ్యాక్టీరియాను నిర్మూలించి వాపు, ఎరుపుదనం తగ్గిస్తుంది. కొన్ని చుక్కలు ఆయిల్‌ను మొటిమలపై రాత్రి పూట రాసి, ఉదయం కడిగేయాలి. నిరంతరం చేస్తే, మెరుగైన ఫలితాలు పొందవచ్చు.
2. యాపిల్ సైడర్ వెనిగర్ – మొటిమలపై సహజ యాసిడ్ దెబ్బ

యాపిల్ సైడర్ వెనిగర్‌లో ఉండే సిట్రిక్ యాసిడ్ మొటిమలకు కారణమయ్యే బ్యాక్టీరియాను నాశనం చేస్తుంది. కొద్దిగా వెనిగర్‌ను నీటిలో కలిపి, కాటన్ సహాయంతో మొటిమలపై రాసి 30 నిమిషాల తర్వాత కడిగేయాలి. ఇది చర్మాన్ని శుభ్రంగా ఉంచుతుంది.
3. క‌ల‌బంద గుజ్జు – చర్మానికి చల్లదనం

అలొవెరా గుజ్జులో యాంటీ ఇన్‌ఫ్లామేటరీ, యాంటీ బాక్టీరియల్ లక్షణాలు ఉన్నాయి. ఇది మొటిమలు తగ్గించడమే కాకుండా, ముఖానికి ప్రకాశాన్ని కూడా ఇస్తుంది. రాత్రి పూట మొటిమలపై రాసి, ఉదయం కడిగితే చర్మం మెరిసిపోతుంది. ముడతలు, మచ్చలు తగ్గుతాయి.
4. తేనె – సహజ రక్షకుడిగా

తేనెలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు చర్మాన్ని సంరక్షిస్తాయి. తేనెను మొటిమలపై రాసి, గంటసేపు వదిలి కడిగేయండి లేదా రాత్రికి రాత్రి ఉంచండి. రోజుకు రెండు సార్లు ఇలా చేస్తే మొటిమలు తగ్గుతాయి.
5. జింక్ లోపాన్ని దూరం చేయండి

జింక్ లోపం ఉన్నవారిలో మొటిమలు ఎక్కువగా కనిపిస్తాయి. జింక్ అధికంగా లభించే ఆహారాలు: మటన్‌, కోడి గుడ్లు, సముద్ర ఆహారం, పప్పులు, విత్తనాలు, పాల ఉత్పత్తులు. ఇవి చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి.

Tags:

About The Author

Advertisement

Latest News

ఒక సంవత్సరం విధులు పూర్తయిన సందర్భంగా.  ఒక సంవత్సరం విధులు పూర్తయిన సందర్భంగా. 
నేను సైతం.    -మన్నెంలో 'రాహుల్ రేలా'                                             -అడవి బిడ్డలకు కొండంత అండ.                          -గిరిజన ప్రగతికి కీలక అడుగులు.                            -పదునైన ప్రణాళికలతో ఫలితాలు.                          -ఏడాది పాలనలోనే యువ ఐఏఎస్...
మాదక ద్రవ్యాల నిర్మూలనలో విద్యార్థులందరూ భాగస్వామ్యం అవ్వాలి
రంగారెడ్డి జిల్లా APM పల్లె కృష్ణయ్యకు గ్రాట్యూటీ చెక్కును కుటుంబానికి అందజేసిన కలెక్టర్
స్ట్రాబెర్రీలు.. చిన్న పండ్లు, గొప్ప లాభాలు!
మహేష్‌ బాబు డెడికేషన్‌ నాకు పాఠం లాంటిది: త్రిష
రింకూ సింగ్, ప్రియా సరోజ్‌ వివాహం వాయిదా!
ఎమ్మెల్యే నాయిని కి కృతజ్ఞతలు