పదవ తరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించిన ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు సన్మానం
- ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుతుంది
- ఇల్లంద పాఠశాల వజ్రోత్సవ కమిటీ
వరంగల్( లోకల్ గైడ్ తెలంగాణ ): ప్రభుత్వ బడి పిల్లలు ప్రగతి గల పిడుగులు అనే నినాదాన్ని నిజం చేస్తూ 2024 25 విద్యా సంవత్సరం 10వ తరగతి వార్షిక పరీక్షలలో వర్ధన్నపేట మండలంలోని ఇల్లంద జిల్లా పరిషత్ పాఠశాల విద్యార్థిని దొర్ణం వర్షిక (540/600) మండలంలోని జిల్లా పరిషత్ పాఠశాలలో మొదటి స్థానం సాధించడంతో విద్యార్థిని దొర్ణం వర్షిక ను ఇల్లంద ప్రభుత్వ పాఠశాల వజ్రోత్సవ కమిటీ ఆధ్వర్యంలో విద్యార్థిని, విద్యార్థిని తల్లిదండ్రులను, పాఠశాల ఇంచార్జ్ ప్రధానోపాధ్యాయులు రాగిరి కృష్ణను సన్మానించి అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా వజ్రోత్సవ కమిటీ అధ్యక్షులు, బాధ్యులు మాట్లాడుతూ ఇల్లంద గ్రామంలోని ప్రతి ఒక్కరూ వారి పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలలో చదివించి పాఠశాలలను బలోపేతం చేయడంలో భాగస్తులు కావాలని కోరారు. రానున్న విద్యా సంవత్సరంలో ఇంతకుమించి ఉత్తమ ఫలితాలను సాధించగలరని ఆశిస్తున్నామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఇల్లంద గ్రామపంచాయతీ కార్యదర్శి రామారావు, వజ్రోత్సవ కమిటీ అధ్యక్షులు మెడం కుమారస్వామి,బాధ్యులు రాయపురపు కుమారస్వామి,పెంచికల కుమారస్వామి,గుంటి కుమారస్వామి, పెద్దగోని కవిరాజు, శ్రీపాది నాగరాజు,జోగుల సంపత్, సట్ల చంద్రమౌళి, పెద్దోట మహంత్, బోళ్ల అజయ్, ఈద అభినవ్,విద్యార్థిని విద్యార్థులు, తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.
Comment List