అధ్వానంగా తయారైన రోడ్డు
By Ram Reddy
On
తీవ్ర ఇబ్బందులు పడుతున్న వాహనదారులు
పట్టించుకోని అధికారులు
సమస్యను పరిష్కరించాలని వాహనదారులు డిమాండ్
లోకల్ గైడ్:
బషీరాబాద్ మండల కేంద్రంలో రోడ్డు అధ్వానంగా తయారయింది. బషీరాబాద్ గ్రామపంచాయతీ కార్యాలయము ముందు ఉన్న రోడ్డు కొద్దిపాటి వర్షానికే చిన్న చిన్న నీటి గుంతలతో దర్శనమిస్తుంది. దీంతో ఈ రోడ్డు మార్గంలో ప్రయాణం కొనసాగించే వాహనదారులకు తీవ్ర ఇబ్బంది ఏర్పడింది. కాగా ఇదే రోడ్డు మార్గంలో నిత్యం ప్రజాప్రతినిధులు అధికారులు తిరుగుతుంటారు. ఇంత అద్వానంగా ఉన్న రోడ్డుని చూసి కూడా తమకు పట్టనట్లు ఉండటం దురదృష్టకరమని వాహనదారులు ఆరోపిస్తున్నారు. రాబోయే వర్షాకాలంలో ఈ రోడ్డు మరింత ప్రమాదకరంగా తయారయ్యే అవకాశం ఉంది అధికారులు స్పందించి రోడ్డు సమస్య పరిష్కరించాలని వాహానదారులు డిమాండ్ చేస్తున్నారు.
Tags:
About The Author
Related Posts
Post Comment
Latest News
30 Apr 2025 18:04:58
తెలంగాణ పల్లె పాటలు | Telangana Village Songs | Latest Folk Songs | Telugu Folk Songs | LG MEDIA #telaganasongs #villagesongs...
Comment List