జిల్లాలో అధిక నిధులు మంజూరు

  రహదారుల పనులను చేపడతాం 

జిల్లాలో అధిక నిధులు మంజూరు

 శాసనసభ సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్

లోకల్ గైడ్  : గురువారం వికారాబాద్ మండలం మదన్ పల్లి దగ్గర 4.45 కోట్ల కొత్త గడి నుండి బంటు వారం వరకు చేపట్టే  పునర్నిర్మాణ పనులకు స్పీకర్ శంకుస్థాపన చేశారు. తదనంతరం కోటి 81 లక్షల వ్యయంతో అనంతగిరి గుట్ట నంది విగ్రహం వరకు నిర్మించిన సీసీ రోడ్డును స్పీకర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా స్పీకర్ మాట్లాడుతూ... ప్రజా ప్రయోజనాల దృష్ట్యా మెరుగైన రవాణా సౌకర్య వసతులు కల్పించేందుకు ఎన్ని నిధులైన వెచ్చిస్తామన్నారు. రవాణా ముఖ్యమైన రవాణా రహదారులతో పాటు తోపాటు గ్రామాల్లో సీసీ రోడ్ల ఏర్పాట్లకు నిధులు మంజూరు చేయడం జరుగుతుందని స్పీకర్ తెలిపారు.అనంతరం అటవీ శాఖ అతిథి గృహ ఆవరణలో మూడు కోట్ల వ్యయంతో నిర్మాణాలు చేపడుతున్న 4 కాటేజ్ లను స్పీకర్ పరిశీలించారు. ఇందులో భాగంగా అనంతగిరిగుట్ట రహదారిలో స్పీకర్ చెట్లను నాటారు.ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ సుధీర్, జిల్లా అటవీ శాఖ అధికారి జ్ఞానేశ్వర్,  డీసీఎంఎస్ డైరెక్టర్ కిషన్ నాయక్, ఆర్ అండ్ బి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శ్రీధర్ రెడ్డి, ఎంపీడీవో వినయ్ కుమార్ లు పాల్గొన్నారు.

Tags:

About The Author

Post Comment

Comment List

Latest News