ఉద్యమ కళాకారుడికి దక్కిన గౌరవం
శ్రీకాంత్ చారి మెమోరియల్ అవార్డు
లోకల్ గైడ్ : బుధవారం నాడు నింగి నేల - మేము సైతం సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన బడంగ్ పేట్, బాలాపూర్ హైదరాబాద్ లో తెలంగాణ అమరవీరుడు విద్యార్థి శ్రీకాంత్ చారి తెలంగాణ ఉద్యమంలో తన ప్రాణాలకు సైతం లెక్కచేయకుండా తన ఒంటిమీద పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకుని జై తెలంగాణ నినాదాలిస్తూ...ప్రాణాలను బలిదానం చేసిన త్యాగాన్ని యాది చేసుకుంటూ త్యాగనీకి ఎప్పుడు మరువలేమంటూ..తన పేరుమీద తెలంగాణ సాధనలో తమ వంతుగా క్రియాశీలకంగా పాత్ర పోషించినటువంటి ఉద్యమం కళాకారులను గుర్తించి అందులో వికారాబాద్ జిల్లా,బంట్వారం మండలం, బొప్పునారం గ్రామ ఉద్యమ కళాకారుడు ఎంపిక చేసి డా,,ఎండీ. సలాఉద్దీన్(సలీం)కి గౌరవనీయులు మాజీ తొలి శాసన సభాపతి మధుసూదన్ చారి గారు, శ్రీకాంత్ చారి తల్లి కాసోజు శంకరమ్మ ప్రముఖ గాయకుడు దరువు అంజన్న, జాతీయ అధ్యక్షులు జాజుల శీనన్న గారి చేతుల మీదుగా ఘనంగా సన్మానిస్తూ...శ్రీకాంత్ చారి మెమోరియల్ అవార్డును అందుకోవడం జరిగింది.ఈ త్యాగాన్నీ గుర్తిస్తూ పురస్కారన్నీ అందించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ...అదే సందర్బంగా డా,,సలీం మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యమాకళాకారులకు గుర్తించి సారధిలో ఉద్యోగాలు ఇచ్చి ఆదుకోవాలని కోరారు.ఈ విషయం తెలుసుకున్న ఉద్యమకారులు,రాజకీయ నాయకులు, స్నేహితులు అభినందిస్తూ శుభాకాంక్షలు తెలియజేశారు.
Comment List