జిల్లా కలెక్టర్ తో సమావేశమైన పర్యాటక శాఖ అధికారులు
లోకల్ గైడ్ : మిస్ వరల్డ్ పోటీలలో పాల్గొనే వివిధ దేశాలకు చెందిన సుందరిమణుల వరంగల్ పర్యటన నేపథ్యంలో హనుమకొండ జిల్లా కలెక్టరేట్ లో జిల్లా కలెక్టర్ పి.ప్రావీణ్య తో పర్యాటక శాఖ అధికారులు బుధవారం సమావేశమయ్యారు.మే 14వ తేదీన హైదరాబాద్ నుండి వివిధ దేశాలకు చెందిన సుందరీమణులు జిల్లా పర్యటనలో భాగంగా హనుమకొండ లోని చారిత్రక వేయి స్తంభాల దేవాలయం, ఫోర్ట్ వరంగల్ ను సందర్శించనున్న నేపథ్యంలో ఇక్కడ చేయాల్సిన ఏర్పాట్లకు సంబంధించి పర్యాటకశాఖ డీజీఎంలు నాథన్, ఇబ్రహీం, చీఫ్ ఇంజనీర్ శ్రీనివాస్ లు జిల్లా కలెక్టర్ ప్రావీణ్యతో సమావేశమై పలు అంశాలపై చర్చించారు. హైదరాబాద్ లో నిర్వహించనున్న మిస్ వరల్డ్ పోటీలలో వివిధ దేశాలకు చెందిన సుందరీమణులు పాల్గొననున్నారు. పలు దేశాలకు చెందిన సుందరీమణులు వరంగల్ పర్యటనలో భాగంగా వేయి స్తంభాల దేవాలయం, ఫోర్ట్ వరంగల్ ను సందర్శించేందుకు రానున్నారు. ఈ నేపథ్యంలో రెండు చోట్ల చేయాల్సిన ఏర్పాట్లు, భద్రత అంశాలపై మే 2న హనుమకొండ, వరంగల్ జిల్లాల కలెక్టర్లు ప్రావీణ్య, డాక్టర్ సత్య శారద, వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్, జిడబ్ల్యూఎంసి కమిషనర్ అశ్విని తానాజీ వాకడే, సంబంధిత శాఖల అధికారులతో పాటు ఈవెంట్ ఆర్గనైజర్లు సమావేశమవుతారని పర్యాటకశాఖ అధికారులు తెలిపారు.
Comment List