కళ్యాణ మండపాన్ని ప్రారంభించిన గద్వాల ఎమ్మెల్యే 

కళ్యాణ మండపాన్ని ప్రారంభించిన గద్వాల ఎమ్మెల్యే 

లోకల్ గైడ్: గద్వాల నియోజకవర్గం కె.టి దొడ్డి మండల పరిధిలోని పాగుంట వెంకటాపురంలోని శ్రీశ్రీశ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయం నందు నూతనంగా నిర్మించిన కళ్యాణ మండపాన్ని బుధవారం గద్వాల ఎమ్మెల్యే  బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ప్రారంభించారు. అంతకుముందు  వేద పండితులు, ఆలయ ఈవో ఎమ్మెల్యే కి  స్వాగతం పలికారు. ముందుగా శ్రీశ్రీశ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయంలో ఎమ్మెల్యే  ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారి ఆశీస్సులను పొందారు. అనంతరం నూతన కళ్యాణ మండపాన్ని ఎమ్మెల్యే      ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ యార్డ్ ఛైర్మన్ కురువ హనుమంతు, మాజీ ఎంపీపీ విజయ్, మాజీ వైస్ ఎంపీపీ రామకృష్ణ నాయుడు, నాయకులు ఉరుకుందు, శేఖర్ రెడ్డి రాజేష్, ఆంజనేయులు చంద్రశేఖర్, వెంకన్న గౌడ్, హరి ప్రసాద్ గౌడ్, అమరేష్, శేఖర్ రెడ్డి, టిచర్ గోవిందు, ఆంజనేయులు, గోపి,  యూత్ అధ్యక్షుడు మల్లేష్ గౌడ్, యువ వీరేష్, కాసీం, నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Post Comment

Comment List

Latest News