పన్నుల వసూలు ప్రక్రియ త్వరితగతిన పూర్తి చేయాలి. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్.
లోకల్ గైడ్ :
పన్నుల వసూలు, ఎల్ఆర్ఎస్, వాణిజ్య లైసెన్సుల పునరుద్ధరణ, వేసవి క్యాంపుల నిర్వహణ, తదితర అంశాలపై మున్సిపల్ అధికారులతో శుక్రవారం రాత్రి స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలోని మున్సిపాలిటీలలో అన్ని రకాల పన్నుల వసూలు ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేయాలన్నారు. ఇప్పటివరకు పూర్తి చేసిన పన్నుల వసూలు, రావాల్సిన బకాయిల వివరాలను మునిసిపాలిటీల వారిగా అధికారులను అడిగి తెలుసుకున్నారు. సమయానికి పన్నులు చెల్లించని వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని సూచించారు. వాణిజ్య లైసెన్సుల పునరుద్ధరణ ప్రక్రియను పూర్తి చేయాలన్నారు. విద్యార్థుల కోసం ఏర్పాటు చేయనున్న వేసవి శిబిరాన్ని పకడ్బందీగా నిర్వహించేలా కార్యాచరణ రూపొందించుకోవాలన్నారు. ఈ నెలాఖరుతో ఎల్ఆర్ఎస్ క్రమబద్ధీకరణ ఫీజులో 25 శాతం రాయితీ ముగుస్తుందని, ఆమోదం పొందిన దరఖాస్తుదారులంతా ఈ అవకాశాన్ని వినియోగించుకునేలా చర్యలు తీసుకోవాలన్నారు.ఈ సమావేశంలో మున్సిపల్ కమిషనర్లు జగదీశ్వర్ గౌడ్, జాదవ్ కృష్ణ, రాజేష్ కుమార్, అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
Comment List