చేసే దానాలు చరిత్రలో నిలిచిపోవాలి 

 షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ 

చేసే దానాలు చరిత్రలో నిలిచిపోవాలి 

 షాద్ నగర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల నిర్మాణానికి ప్రముఖ వ్యాపారవేత్త రవికుమార్ అగర్వాల్ భారీ విరాళం 

 రూ. 11లక్షల చెక్కు అందజేత 

లోకల్ గైడ్ షాద్ నగర్ 

చేసే దానాలు చరిత్రలో చిరకాలం నిలిచిపోయేలా ఉండాలని, అవి పదిమందికి పది తరాలపాటు ఉపయోగపడాలని షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు. రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల నిర్మాణాన్ని దాతల సహకారంతో నిర్మిస్తున్న సందర్భంగా రవి ఫ్రూట్స్ అధినేత రవికుమార్ అగర్వాల్ కేదార్నాథ్ అగర్వాల్ అదేవిధంగా రాజేందర్ కుమార్ అగర్వాల్ కలిసి 11 లక్షల రూపాయల విరాళాన్ని కళాశాల నిర్మాణం కోసం అందజేశారు. ఈ సందర్భంగా శుక్రవారం 11 లక్షల చెక్కును వారు స్థానిక ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ కు అందజేశారు. 
ఈ సందర్భంగా ఎమ్మెల్యే శంకర్ మాట్లాడుతూ చరిత్రలో కనివిని ఎరుగని విధంగా ప్రభుత్వ జూనియర్ కళాశాలను నిర్మించి ఈ ప్రాంత రుణం తీర్చుకోవాలని చేస్తున్న కృషికి దాతలు ఈ విషయం తెలుసుకొని విద్య సాయం కోసం ముందుకు రావడం ఎంతో గర్వించదగ్గ విషయమని కొనియాడారు. మనం పోయిన మనం చేసిన పనులు చిరకాలం గుర్తుండిపోయేలా ఉండాలన్నారు. ప్రపంచంలో సామాజిక సేవ తత్పరతకు మించిన సంతృప్తి మరొకటి ఉండదని డబ్బులు అందరు సంపాదిస్తారని అయితే వాటిని ప్రజాప్రయోజనార్ధం ఖర్చు చేయడం అనేది గొప్ప విషయమని గొప్ప మనసు ఉండాలని కోరారు. దాతల సహకారంతో పెద్ద ఎత్తున నిర్మిస్తున్న కళాశాల భవన నిర్మాణం కోసం ప్రముఖ వ్యాపారవేత్తలు రవి ఫ్రూట్స్ అధినేతలు రవికుమార్ అగర్వాల్ కేదార్నాథ్ అగర్వాల్ రాజేందర్ కుమార్ అగర్వాల్ లను ప్రత్యేకంగా అభినందిస్తున్నట్టు తెలిపారు. ఈ సందర్భంగా దాతలు మాట్లాడుతూ.. ఎమ్మెల్యే శంకర్ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ గొప్ప పనికి తమ వంతు సహకారం అందించే విధంగా తాము ముందుకు వచ్చినట్టు తెలిపారు. రవి ఫ్రూట్స్ సంస్థ నుండి తాము 11 లక్షల రూపాయలు కళాశాల నిర్మాణం కోసం ఒక మంచి కార్యక్రమం కోసం ఇస్తుండడం గొప్పగా ఉందని ఇది ఎంతో సంతృప్తిని ఇస్తుందని పేర్కొన్నారు. ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ కృషిని వారు ప్రత్యేకంగా అభినందించారు. భవిష్యత్తులో ఎమ్మెల్యే శంకర్ మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని పదిమంది ప్రజలకు ఉపయోగపడేలా కార్యక్రమాలు చేపట్టాలని వారు సూచించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేను అభినందించారు. అనంతరం దాతలను ఎమ్మెల్యే శంకర్ తదితరులు సన్మానించారు..

Tags:

About The Author

Post Comment

Comment List

Latest News