యువతకు ఉద్యోగ నైపుణ్యం పెంచేందుకు శిక్షణ కేంద్రం ఏర్పాటు చేయాలని మంత్రికి ఎమ్మెల్యే వినతి
లోకల్ గైడ్:
జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో చదువుకున్న, చదువుకోని యువతి యువకులకు ఉద్యోగ నైపుణ్య అవకాశాలు పెంపొందించి ఉపాధి కల్పించాలని కోరుతూ ఇటీవల గద్వాల శాసనసభ్యులు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు ను కలిసి విన్నవించారు. మంత్రి సానుకూలంగా స్పందించారు. మంత్రి ఆదేశాల మేరకు శుక్రవారం తెలంగాణ అకాడమిక్ ఫర్ స్కిల్స్ డెవలప్మెంట్ (టాస్క్) సీఈఓ శ్రీకాంత్ సిన్హా, ప్రతినిధుల బృందం గద్వాల ఎమ్మెల్యే ను కలిశారు. అనంతరం ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డితో పాటు జిల్లా కలెక్టర్ బి.యం. సంతోష్ ను కలిసి వివరించారు. జిల్లా కేంద్రంలో మౌలిక వసతులు కల్పిస్తే ఉద్యోగ నైపుణ్య శిక్షణ కేంద్రం ఏర్పాటు చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని హామీ ఇచ్చారు. అయితే త్వరలోనే మౌలిక వసతులు కల్పిస్తామని కలెక్టర్, ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ విజయ్, జిల్లా ప్రైవేట్ స్కూల్ అసోసియేషన్ అధ్యక్షుడు బాబు నాయుడు నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
Comment List