‘భూ భారతి 2025' నూతన ఆర్.ఓ.ఆర్ చట్టం భూ

పరిష్కారానికి ఎంతగానో దోహదపడుతుంది: కలెక్టర్ సి.నారాయణ రెడ్డి

‘భూ భారతి 2025' నూతన ఆర్.ఓ.ఆర్ చట్టం భూ

లోకల్ గైడ్:
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ‘భూ భారతి 2025' నూతన ఆర్.ఓ.ఆర్ చట్టం భూ వివాదాల పరిష్కారానికి ఎంతగానో దోహదపడుతుందని జిల్లా కలెక్టర్ సి.నారాయణ రెడ్డి అన్నారు.గురువారం రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గం, షాబాద్ మండల్లోని స్టార్ ఫంక్షన్ హాల్ లో భూ భారతి చట్టం-2025 పై అవగాహన సదస్సు లో జిల్లా కలెక్టర్ సి.నారాయణ రెడ్డి పాల్గొని, భూభారతి చట్టంపై, అందులోని అంశాలపై వివరిస్తూ రైతులకు అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రజలకు ఎలాంటి భూ వివాదాలకు తావు లేకుండా రైతులకు సంబంధించిన భూములపై వారికి పూర్తి యాజమాన్య హక్కులు కల్పించేందుకు ప్రభుత్వం ఆనేక కొత్త అంశాలను పొందుపరుస్తూ ఈ నూతన ఆర్.ఓ.ఆర్ చట్టాన్ని తెచ్చిందని, ధరణి స్థానంలో కొత్తగా  భూ భారతి వ్యవస్థను అమలు చేస్తున్నట్లు తెలిపారు. భూ భారతి 2025 చట్టంలో 23 సెక్షన్లు మరియు 18 నిబంధనలున్నాయని తెలిపారు.  ప్రభుత్వం ఆధార్ తరహాలో భవిష్యతులో  భూమికి సంబంధించి సర్వే చేసి కొలతలు, హద్దుల వంటి సమగ్రమైన వివరాలతో 'భూధార్' తీసుకురాబోతుందని పేర్కొన్నారు. ఈ చట్టం ద్వారా భూముల రికార్డుల్లో తప్పుల సవరణకు అవకాశం కల్పించబడినదని, భూమి రిజిస్ట్రేషన్, మ్యూటేషన్‌కు ముందు తప్పని సరిగా భూమి సర్వే జరిపించి మ్యాప్ తయారు చేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు. మ్యుటేషన్ ఫీస్ క్రింద ఎకరాకు 2500 రూపాయలు ఉంటుందన్నారు. ప్రస్తుతం పెండింగ్‌లో ఉన్న సాదా బైనామాల పరిష్కారం ఈ చట్టం ద్వారా వేగవంతం కావడంతోపాటు, వారసత్వ భూముల మ్యూటేషన్‌ను గడువులో పూర్తి చేయడం, హక్కుల సంక్రమణను అధికారికంగా నమోదు చేయడం ద్వారా వ్యవస్థ మరింత నిబద్ధతతో పని చేస్తుందని కలెక్టర్ తెలిపారు. భూ సమస్యల పరిష్కారానికి రెండు అంచెల అప్పీల్ వ్యవస్థ రైతులకు న్యాయబద్ధమైన మార్గం కల్పిస్తోందని తెలిపారు. ఇంటి స్థలాలు, ఆబాది, వ్యవసాయేతర భూములకు హక్కుల రికార్డులతో వ్యవస్థను సమగ్రంగా అభివృద్ధి చేయడంతో పాటు, భవిష్యత్తులో పేద రైతులకు ఉచిత న్యాయ సహాయం అందించే దిశగా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. గ్రామ రెవెన్యూ రికార్డుల నిర్వహణను శాస్త్రీయంగా చేస్తూనే, మోసపూరితంగా పొందిన ప్రభుత్వ భూములపై పట్టాలను రద్దు చేసే అధికారం ఈ చట్టం ద్వారా కల్పించబడిందని,భూ భారతి రైతుల సమస్యలకు శాశ్వత పరిష్కారంగా నిలుస్తోందని పేర్కొన్నారు.  గ్రామాల్లో మండల వ్యవసాయాధికారుల సహకారంతో రైతు వేదికల వద్ద రెవెన్యూ సదస్సులు నిర్వహణ చేసి, ఈ చట్టంపై అవగాహన కార్యక్రమాలు చేపడతామని, భూ సమస్యల పరిష్కారానికి ఎంతో వెసులుబాటు కల్పించే భూభారతి చట్టంపై అవగాహనను ఏర్పర్చుకోవాలని, దీనిని పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని రైతులకు సూచించారు.  సదస్సులో రైతులు అడిగిన సందేహాలను కలెక్టర్ నివృత్తి చేశారు.సదస్సులో పాల్గొన్న చేవెళ్ల శాసన సభ్యులు  కాలే యాదయ్య మాట్లాడుతూ ప్రజా ప్రభుత్వం రైతుల గురించి ఆలోచన చేస్తూ రైతు ప్రయోజనాలను కాపాడుతుందన్నారు. ఏక కాలంలో రుణమాఫీ జరిగిందని,  నియోజక వర్గానికి ఇప్పటికే  రైతులకి రుణ మాఫీ జరిగిందని తెలిపారు. రానున్న రోజుల్లో ఇంకా రైతులకు అనేక సౌకర్యాలు కల్పించి రైతును రాజు గా చూడడమే ప్రభుత్వ ముఖ్య ఉద్దేశం అన్నారు. భూ భారతి చట్టం పై ఏమైనా సందేహాలు ఉంటే తీర్చడానికి అధికారులు మన జిల్లా అధికారులు ఎప్పుడూ సిద్ధంగా ఉంటారని అన్నారు.సమావేశానికి ముందు ఆర్డీఓ చంద్రకళ భూభారతి కొత్త ఆర్వోఆర్ చట్టం గురించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. చట్టం లో తీసుకొచ్చిన చట్టాల గురించి ప్రత్యేకంగా వివరించడం జరిగింది.ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంధాలయ ఛైర్మన్ మధుసూదన్ రెడ్డి, ఆర్డీవో చంద్రకళ, మార్కెట్ కమిటీ చైర్మన్లు, ఎమ్మార్వో, ఎంపీడీవో, రైతులు, రైతు సంఘాల నాయకులు, సంబంధిత అధికారులు, ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

 ఫలితాలను వెల్లడించిన త్రివేణి కృష్ణవేణి విద్యాసంస్థల డైరెక్టర్ గొల్లపూడి జగదీష్  ఫలితాలను వెల్లడించిన త్రివేణి కృష్ణవేణి విద్యాసంస్థల డైరెక్టర్ గొల్లపూడి జగదీష్
'పది'ఫలితాలలో త్రివేణి విజయభేరి 
సామ్రాజ్యవాద శక్తుల చేతిలో మగ్గుతున్న శ్రామికవర్గాన్ని రక్షించేది 'ఎర్ర జెండానే'
పని గంటలను పెంచనివ్వం: - సీఐటీయూ
శివాలయం పునర్ నిర్మాణానికి 75వేల విరాళం అందజేసిన బండ్ల రాజశేఖర్ రెడ్డి
జనగణనతో పాటు కులగణన చేస్తామని కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
అక్షయ తృతీయ నాడు ఒడిశా 51 లక్షల మంది రైతుల ఖాతాకు ₹1025 కోట్లు బదిలీ 
మారుమూల ఆదివాసి గ్రామాల్లో  మెరుగైన వైద్యం సౌకర్యవంతంగా చూడాలి.