గడపగడపకు జై బాబు, జై భీమ్, జై సంవిదాన్ నినాదం

కష్టకాలంలో పార్టీకి పనిచేసిన వారికే ప్రాధాన్యత

ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి

2a9aaf66-4ded-4e86-a8a0-a61666649f91

లోకల్ గైడ్  :

గాంధీ అహింసవాదాన్ని  అంబేద్కర్ ఆశయ సాధనను రాజ్యాంగ పీఠికను పరిరక్షించుకునే అవసరం ఎంతైనా ఉందని భావించి కాంగ్రెస్ పార్టీ చేపట్టిన జై బాపు, జై భీమ్, జై సంవిదాన్ కార్యక్రమం గడపగడపకు తీసుకెళ్లి  ప్రజలను చైతన్యవంతం చేయాల్సిన అవసరం ఎంత ఉందని వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి పేర్కొన్నారు.జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో  మంగళవారం వనపర్తి పట్టణంలోని ఆర్ జి గార్డెన్లో నిర్వహించిన  జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమానికి ఎమ్మెల్యే ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు.పార్లమెంట్ సాక్షిగా జై భీమ్ అన్న పదాన్ని అవమానపరుస్తూ భారతీయ జనతా పార్టీ నాయకులు చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని భావించిన  కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం  జై బాబు, జై భీమ్, జై సంవిధాన్  కార్యక్రమాన్ని చేపట్టిందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. జై బాబు,జై భీమ్, జై సంవిధాన్ రాష్ట్ర సమన్వయకర్త కీర్తిశేషులు గద్దర్ అన్న కుమార్తె వెన్నెలమ్మ ఆధ్వర్యంలో  చేపట్టిన ఈ కార్యక్రమాన్ని నియోజకవర్గంలోని ప్రతి ఇంటికి తీసుకు వెళ్లాల్సిన బాధ్యత మనందరిపై ఉందని ఎమ్మెల్యే సూచించారు.కష్టకాలంలో కాంగ్రెస్ పార్టీ జెండా మోసిన వారికే ప్రాధాన్యత ఉంటుందని  ఎవరు ఎలాంటి నిరాశ నిస్పృహలకు లోను కాకూడదని ఎమ్మెల్యే సూచించారు.కుటుంబ పార్టీలో ఉన్న చిన్న చిన్న సమస్యలు వస్తుంటాయి పోతుంటాయి  కానీ కాంగ్రెస్ పార్టీ కుటుంబం అంతా ఒక్కటేనని ఆయన పేర్కొన్నారు.సోషల్ మీడియా వేదికగా కాంగ్రెస్ పార్టీపై విషప్రచారం చేసే వారికి బుద్ధి చెబుతూ కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన ప్రతి పథకాలను ఇంటింటికి చేరవెయ్యాలని ఎమ్మెల్యే సూచించారు. విద్యాపరంగా, వైద్యం పరంగా, సాగునీటిపరంగా, తాగునీటిపరంగా, వ్యవసాయపరంగా రుణమాఫీ, రైతు భరోసా, రైతు బోనస్, రోడ్ల నిర్మాణం పరంగా, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు లాంటి అనేక పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఎమ్మెల్యే సూచించారు.ధరణి పోర్టల్తో అందిన కాడికి భూ కబ్జాలు చేశారని నేడు కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన భూ భారతి చట్టంతో ప్రతి రైతు సమస్య పరిష్కారం అవుతుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు.వనపర్తి నియోజకవర్గంలో ఒకేరోజు 1000 కోట్ల పనులకు గౌరవనీయ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు ఎనుముల రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో శ్రీకారం చుట్టామని మరికొద్ది రోజుల్లోనే మరో వెయ్యి కోట్ల రూపాయల అభివృద్ధి పనులను నియోజకవర్గానికి తీసుకురాబోతున్నామని ఎమ్మెల్యే తెలిపారు.నిరుపేదల అభ్యున్నతి కోసం కాంగ్రెస్ పార్టీ అహర్నిశలు పనిచేస్తుందని  రానున్న కాలంలో కాంగ్రెస్ పార్టీని ప్రతి ఒక్కరు ఆదరించాలని ఆయన కోరారు. అనంతరం సభ ప్రాంగణం నుంచి భగీరథ చౌరస్తా మీదుగా వివేకానంద చౌరస్తా మీదుగా రాజీవ్ గాంధీ చౌరస్తా మీదుగా అంబేద్కర్ చౌరస్తా వరకు వారు జై బాబు, జై భీమ్, జై సంవిదాన్ కార్యక్రమం భారీ ర్యాలీని నిర్వహించారు.అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి వారు నివాళులు అర్పించారు.ఈ కార్యక్రమంలో టిపిసిసి అధికార ప్రతినిధి కేశం నాగరాజు  జై బాబు, జై భీమ్, జై సంవిదాన్ కార్యక్రమ సమన్వయకర్త వెన్నెలమ్మ జాన్ మొహమ్మద్ నసీర్ సంజీవ్ ముదిరాజ్  గౌరీ సతీష్ తోపాటు కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రాజేంద్రప్రసాద్ యాదవ్ వనపర్తి వ్యవసాయ  మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాస్ గౌడ్, పెబ్బేరు మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రమోదిని రెడ్డి, స్థానిక కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు చీర్ల విజయ చందర్,  పీసీసీ సభ్యులు శంకర్ ప్రసాద్, ఓబీసీ జిల్లా అధ్యక్షులు కోట్ల రవి, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు వెంకటేష్, ఎస్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు వాల్య నాయక్,  జిల్లా దిశా కమిటీ సభ్యులు శంకర్ నాయక్, ధనలక్ష్మి, వికలాంగుల సంఘం జిల్లా అధ్యక్షులు రమేష్,  కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి,  మాజీ మున్సిపల్ చైర్మన్ పుట్టపాక మహేష్,  బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్, వనపర్తి నియోజకవర్గం సమన్వయకర్త లక్కాకుల సతీష్ పట్టణ వర్కింగ్ ప్రెసిడెంట్ కదిరే రాములు,  జిల్లా సోషల్ మీడియా కన్వీనర్ దేవన్న యాదవ్,  సేవాదల్ జిల్లా అధ్యక్షుడు జానకి రాముడు,  మాజీ జిల్లా కార్యదర్శి తిరుపతయ్య అన్ని మండలాల అధ్యక్షులు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Tags:

About The Author

Post Comment

Comment List

Latest News