సింహాచలం ప్రమాదం గురించి తెలిసి ఎంతో దిగ్భ్రాంతిగా అనిపించింది: పవన్ కళ్యాణ్

సింహాచలం ప్రమాదం గురించి తెలిసి ఎంతో దిగ్భ్రాంతిగా అనిపించింది: పవన్ కళ్యాణ్

లోకల్ గైడ్: విశాఖ జిల్లా సింహాచలం అప్పన్నస్వామి ఆలయం వద్ద అపశ్రుతి చోటు చేసుకున్నది. దర్శనానికి బారులు తీరిన భక్తులపై గోడ కూలిపోయింది. ఈ ఘటనలో ఇప్పటి వరకు ఎనిమిది ప్రాణాలు కోల్పోయారు.Pawan Kalyan | విశాఖ జిల్లా సింహాచలం అప్పన్నస్వామి ఆలయం వద్ద అపశ్రుతి చోటు చేసుకున్నది. దర్శనానికి బారులు తీరిన భక్తులపై గోడ కూలిపోయింది. ఈ ఘటనలో ఇప్పటి వరకు ఎనిమిది ప్రాణాలు కోల్పోయారు. పలువురు గాయపడగా వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం సంఘటనా స్థలంలో ఎస్టీఆర్‌ఎఫ్ బృందాలు, పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. ఈ ఘటనపై ఇప్ప‌టికే ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేయ‌గా.. తాజాగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఎక్స్ వేదిక‌గా స్పందించాడు.సింహాచలంలో గోడ కూలడం మూలంగా క్యూ లైన్ లో ఉన్న ఎనిమిది మంది భక్తులు మృతి చెందారని తెలిసి తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యాను. చందనోత్సవ సమయాన ఈ దుర్ఘటన చోటు చేసుకోవడం దురదృష్టకరం. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నాను. వారికి రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుంది. విశాఖపట్నం జిల్లా అధికారుల నుంచి ఈ ఘటన వివరాలు తెలుసుకున్నాను. భారీ వర్షాల మూలంగా గోడ కూలిందని తెలిపారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని సూచించాను అంటూ ప‌వ‌న్ క‌ళ్యాణ్ రాసుకోచ్చాడు.

Tags:

About The Author

Post Comment

Comment List

Latest News