ప్లేఆఫ్స్ రేసులో నుంచి సన్‌రైజర్స్ హైదరాబాద్ నిష్క్రమణ
వర్షం ఆటకు అడ్డంకి – ప్యాట్ కమిన్స్ శ్రమ వృథా
హైదరాబాద్:
ఐపీఎల్ 2025 సీజన్‌లో ప్లేఆఫ్స్ ఆశలపై సన్‌రైజర్స్ హైదరాబాద్ నీళ్లు జల్లింది. సోమవారం ఉప్పల్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. ఫలితంగా ఇరు జట్లకు చెరో పాయింట్ కేటాయించడంతో, హైదరాబాద్ ప్లేఆఫ్స్ రేసు నుంచి అధికారికంగా నిష్క్రమించింది.ఇప్పటికే చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ రేసు నుంచి తప్పుకోగా, తాజాగా హైదరాబాద్ కూడా అదే బాట పట్టింది. ఇప్పటివరకు ఆడిన 11 మ్యాచ్‌లలో 7లో ఓడిన హైదరాబాద్, ఒక మ్యాచ్ రద్దు కావడంతో కేవలం 7 పాయింట్లతో 8వ స్థానంలో కొనసాగుతోంది. మూడు మ్యాచ్‌లు మిగిలి ఉన్నప్పటికీ, ప్లేఆఫ్స్ చేరే అవకాశాలు కోల్పోయినట్టయింది.ఇదిలా ఉండగా, తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ 20 ఓవర్లలో 133/7 స్కోరుకే పరిమితమైంది. కమిన్స్ ధాటికి ఢిల్లీ బ్యాటింగ్ కుదేలై, వర్షం మ్యాచ్‌ను రద్దు చేసిందిసన్‌రైజర్స్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ (3/19) విజృంభణతో ఢిల్లీ క్యాపిటల్స్ టాపార్డర్ తుడిపాటుకు గురైంది. కమిన్స్ వేసిన ఘాతుకమైన స్పెల్ ముందు ఢిల్లీ బ్యాటర్లు పూర్తిగా విఫలమయ్యారు. స్టబ్స్ (41 నాటౌట్), అశుతోష్ (41) మినహా మరెవ్వరూ ప్రతిభ కనబరచలేకపోయారు. దీంతో ఢిల్లీ 20 ఓవర్లలో కేవలం 133/7కే పరిమితమైంది.అయితే, ఢిల్లీ ఇన్నింగ్స్ ముగిశాక సన్‌రైజర్స్ హైదరాబాద్ బ్యాటింగ్ ప్రారంభం కానున్న సమయంలో వరుణుడు కలకలం సృష్టించాడు. ఒక్కసారిగా ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురవడం ప్రారంభమైంది. మైదానం పూర్తిగా చిత్తడిగా మారిపోయింది. గ్రౌండ్ సిబ్బంది కవర్లతో మైదానాన్ని కప్పేందుకు ప్రయత్నించినా వర్ష తీవ్రత కారణంగా ప్రయోజనం లేకపోయింది. మైదానంలో నీరు నిలిచిపోవడంతో ఆట ప్రారంభించే అవకాశాలు లేకుండాపోయాయి. పలుమార్లు మైదానాన్ని పరిశీలించిన అంపైర్లు, పరిస్థితులు ఆటకు అనుకూలంగా లేవని తేల్చారు. దీంతో ఇరు జట్ల కెప్టెన్ల సమక్షంలో మ్యాచ్‌ను అధికారికంగా రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ పరిణామంతో స్టేడియం వద్ద ఉత్సాహంగా ఎదురుచూస్తున్న అభిమానులు తీవ్ర నిరాశతో మైదానాన్ని విడిచారు.
Comment List