మహబూబ్ నగర్ పాలమూరు గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా...!?

మహబూబ్ నగర్ పాలమూరు  గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా...!?

పాలమూరు పేరుతో ఇతర వ్యాసాలున్నాయి

వాటి లింకుల కోసం పాలమూరు (అయోమయ నివృత్తి) చూడండి

మహబూబ్ నగర్, తెలంగాణ రాష్ట్రం,మహబూబ్ నగర్ జిల్లా, మహబూబ్ నగర్ మండలానికి చెందిన నగరం.[2][3] 2016 అక్టోబరు 11 న చేసిన తెలంగాణ జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ నగరం పాత మహబూబ్ నగర్ జిల్లా లోని మహబూబ్ నగర్ మండలంలో ఉండేది.

 

నగర చరిత్ర

ఈ ప్రాంతంలో పాలు, పెరుగు సమృద్ధిగా లభించుట కారణంగా ఈ నగరానికి పాలమూరు అని పేరు ఉండేది.పాలమూరు అని కూడా పిల్వబడే ఈ నగరానికి చరిత్రలో రుక్కమ్మపేట అని పేరు ఉండేది. హైదరాబాదును పాలిస్తున్న ఆరవ నిజాం మీర్ మహబూబ్ అలీ ఖాన్ పేరు మీదుగా ఈ నగర నామాన్ని మహబూబ్ నగర్‌గా మార్చబడింది. ఇప్పటికీ గ్రామీణ ప్రజలు పాలమూరు నామంతోనే వ్యవహరిస్తారు. మొదట చిన్న పట్టణంగా ఉన్న మహబూబ్ నగర్‌ను జిల్లా కేంద్రం చేయడంతో క్రమక్రమంగా జిల్లాలోనే పెద్ద నగరంగా అభివృద్ధి చెందింది.1883లో జిల్లా ప్రధానకేంద్రం నాగర్‌కర్నూలు నుంచి మహబూబ్‌నగర్‌కు మార్చబడింది.[6] నాగర్‌కర్నూలు జిల్లా కేంద్రంగా ఉన్న సమయంలో ఇక్కడ రైలు మార్గం ఏర్పాటు కావడంతో సౌలభ్యం దృష్ట్యా జిల్లా కేంద్రాన్ని ఇక్కడికి మార్చారు. ప్రారంభంలో లోకాయపల్లి సంస్థానంలో ఉన్న ఈ ప్రాంతం చుక్కాయపల్లిగా కూడా పిలువబడింది. ఈ ప్రాంతానికి అనేక ప్రాంతాల నుంచి వచ్చినవారు స్థిరపడడంతో పాలమూరు, పాతపాలమూరు, న్యూటౌన్ అనే మూడు ప్రాంతాలు ఏర్పడ్డాయి. నిజాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా రజాకర్లపై జరిగిన ఉద్యమంలో ఈ ప్రాంతానికి చెందిన పలువులు పాల్గొన్నారు. ఆ సమయంలో ఇక్కడ ఆర్యసమాజ్ శాఖ బలంగా ఉండేది. క్రమేణా ఈ మూడు ప్రాంతాలు ఏకమైనాయి.మళ్ళీ పాలమూరు పూర్వ వైభవం లో కి రావడానికి పాలకులు కృషి చేస్తున్నారు.

వాతావరణం

ఈ నగర వాతావరణం ప్రధానంగా పొడిగా ఉండటం వలన ఏడాదిలో 9 నెలలు (మార్చి, ఏప్రిల్, మే మినహా) ఆహ్లాదకరంగా ఉంటుంది. వేడిమి, ఇతర ప్రధాన నగరాలలాగానే కనిపించినా, వాస్తవ వేడిమి, ఏ మాత్రం తేడా లేకుండా ఉంటుంది. ఇతర జిల్లా ప్రధాన నగరాల్లో కర్నూలు, వరంగల్ నగరాలలో కనిపించే వాతావరణం కన్నా సుమారు 10 డిగ్రీలు ఉష్ణోగ్రత అధికంగా ఉంటుంది.

రాజకీయం

రాజకీయంగా ఈ నగరం నుంచి పలువురు నాయకులు ప్రసిద్ధి చెందారు. 2009 శాసనసభ ఎన్నికలలో మహబూబ్ నగర్ స్థానం నుంచి గెలుపొందిన ఎన్.రాజేశ్వర్ రెడ్డి ఈ నగరానికి చెందిన వ్యక్తే. నగరంలో కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ, తెరాసలు బలంగా ఉన్నాయి.

క్రీడలు

మహబూబ్‌నగర్‌ నగరంలో క్రికెట్ క్రీడకు మంచి జనాదరణ ఉంది. ఇవే కాకుండా వాలీబాల్, ఫుట్‌బాల్, కబడ్డీ తదితర క్రీడలకు కూడా గుర్తింపు ఉంది. నగరం మధ్యలో బస్టాండు సమీపంలో ఉన్న క్రికెట్ స్టేడియంలో అంతర్‌జిల్లా క్రికెట్ పోటీలు, ఇతర పోటీలు నిర్వహించబడుతాయి. బాలుర జూనియర్ కళాశాల మైదానంలో కూడా క్రికెట్, ఫుట్‌బాల్ పోటీలు నిర్వహించబడుతాయి. ఇవే కాకుండా జిల్లా పరిషత్తు మైదానంలో వాలీబాల్, బ్యాడ్మింటన్, టెన్నికాయిట్ తదితర అంతర్రాష్ట్ర పోటీలు నిర్వహిస్తారు.

స్టేడియంలో 30 లక్షల రూపాయలతో నిర్మించిన స్విమ్మింగ్ పూల్, బాస్కెట్‌బాల్, ఆర్చరీ కోర్టులను 2022 జూన్ 6న తెలంగాణ రాష్ట్ర పర్యాటక-సాంస్కృతిక, క్రీడా శాఖలమంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ ప్రారంభించాడు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ నర్సింహులు, వైస్ చైర్మన్ గణేష్, కౌన్సిలర్స్ రాము, రవికిషన్ రెడ్డి, పటేల్ ప్రవీణ్, జిల్లా అడిషనల్ కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ తదితరులు పాల్గొన్నారు.[8]

దేవాలయాలు

 
మహబూబ్ నగర్ పట్టణంలోని శ్రీరామమందిరం, శ్రీరామనవమి నాటి దృశ్యం
  • శ్రీవెంకటేశ్వరస్వామి దేవాలయం (పిల్లలమర్రి రైల్వే గేట్ వద్ద)
  • అతి ప్రాచీన శివాలయం(వీరన్నపేట,రైల్వే గేట్)
  • శ్రీ రాఘవేంద్రస్వామి దేవాలయం (పరిమళగిరి గుట్ట)
  • శ్రీవీరాంజనేయస్వామి ఆలయం (పరిమళగిరి గుట్ట)
  • శ్రీవెంకటేశ్వరస్వామి దేవాలయం (కొత్త గంజ్)
  • శ్రీ రేణుకాఎల్లమ్మ దేవాలయం (కొత్త బస్టాండు వద్ద)
  • శ్రీరామాలయం (టీచర్స్ కాలనీ)
  • శ్రీఅయ్యప్ప దేవాలయం (అయ్యప్ప గుట్ట)
  • శ్రీకృష్ణమందిరము (కాలని)
  • శ్రీఆంజనేయస్వామి దేవాలయం (రైల్వేస్టేషను వద్ద)
  • చారిత్రక కట్టడాలు

     
    నిరంకుశ నిజాం పాలనకు, దాష్టీక రజాకార్ల ఆగడాలకు వ్యతిరేకంగా మహబూబ్ నగర్ పట్టణ ఉద్యమకారులకు వేదికగా నిలిచిన తూర్పుకమాన్

    తూర్పు కమాన్

    నగరంలోని చారిత్రాత్మక కట్టడం తూర్పు కమాన్ ఎంతో ప్రసిద్ధి చెందింది. నాటి స్వాతంత్ర్యోద్యమ స్ఫూర్తికి ఇది చిహ్నం. దేశానికి స్వాతంత్ర్యం వచ్చాక ఇంకనూ నిజాం నిరంకుశ పాలనలో ఉన్న రోజుల్లో కొందరు దేశభక్తి కల ఉద్యమకారులు తూర్పుకమాన్ పై జాతీయ జెండాను ఎగురవేయాలని ప్రయత్నించారు. ఇది గ్రహించిన నిజాం సైనికులు, పోలీసులు ఈ ప్రయత్నాన్ని వమ్ము చేయాలని పహరాకాశారు. అయిననూ పోలీసుల కళ్ళుగప్పి ఉద్యమకారులు తూర్పుకమాన్ పై జాతీయజెండాను రెపరెపలాడించి తమ పంతం నెగ్గించుకున్నారు. పోలీసులు సమీపించగా కమాన్‌పై నుంచి దూకి ఉద్యమకారులు పోలీసులకు దొరకకుండా తప్పించుకున్నారు. నిజాం రాజ్యం భారత యూనియన్‌లో విలీనమైన పిదప జాతీయ జెండాని ఇక్కడే ఎగురవేసేవారు.[19] సంస్థానాధీశులచే నిర్మించిన మూడు కమాన్లు, రాజప్రసాదం కట్టడాలలో ఇది ఒకటి. మిగితావి మట్టిలో కలిసిపోగా ఇది మాత్రమే మిగిలింది. హైదరాబాదు-రాయచూరు రహదారిపై నుంచి వెళ్ళేవారికి ఇది కనిపిస్తుంది.

    వినోదం

    మహబూబ్‌నగర్ నగరంలోని సినిమా థియేటర్లు

    • AVD థియేటర్
    • వెంకటాద్రి థియేటర్
    • వెంకటేశ్వర థియేటర్
    • శ్రీకృష్ణ థియేటర్
    • ఆసియన్ శ్రీనివాసా థియేటర్

    విద్యాసంస్థలు

     
    ప్రభుత్వ ఉపాధ్యాయ విద్యా కళాశాల, మహబూబ్ నగర్
    పట్టణంలోని డిగ్రీ కళాశాలలు
    • ఎం.వి.ఎస్.డిగ్రీ కళాశాల
    • ఆదర్శ డిగ్రీ కళాశాల
    • గౌతమి డిగ్రీ కళాశాల
    • వనిత డిగ్రీ కళాశాల
    • వాసవి డిగ్రీ కళాశాల
    • స్వామి వివేకానంద డిగ్రీ కళాశాల
    • తక్షశిల డిగ్రీ కళాశాల
    విశ్వవిద్యాలయాలు
    బి.ఎడ్, వృత్తి విద్యా, వైద్య కళాశాలలు
    • ఆదర్శ కాలేజీ ఆఫ్ టీచర్స్.
    • అల్ మదీనా కాలేజీ ఆఫ్ ఎడ్యుకేషన్
    • కాలేజి ఆఫ్ టీచర్స్ ఎడ్యుకేషన్
    • శారద కాలేజి ఆఫ్ ఎడ్యుకేషన్
    • సరోజినీ రాములమ్మ కాలేజీ ఆఫ్ ఫార్మసి
    • వైష్ణవి కాలేజి ఆఫ్ ఎడ్యుకేషన్
    • మహబూబ్‌నగర్ ప్రభుత్వ వైద్య కళాశాల

    పట్టణ ప్రముఖులు

Tags:

About The Author

Related Posts

Post Comment

Comment List

Latest News

‘ఆపరేషన్ సిందూర్’ విజయంపై ప్రముఖుల ప్రశంసలు ‘ఆపరేషన్ సిందూర్’ విజయంపై ప్రముఖుల ప్రశంసలు
పహల్గాంలో ఇటీవల జరిగిన ఉగ్రదాడికి దీటైన ప్రతిస్పందనగా భారత ప్రభుత్వం ‘ఆపరేషన్ సిందూర్’కు శ్రీకారం చుట్టింది. మంగళవారం అర్ధరాత్రి 1.44 గంటలకు భారత సైన్యం పాకిస్తాన్‌లోని ఉగ్రవాద...
ఐరాస భద్రతామండలిలో పాకిస్థాన్‌కు కఠిన ప్రశ్నలు
ఆఖరి బంతికి గెలిచిన గుజరాత్‌ టైటాన్స్‌
'ఆపరేషన్‌ సింధూర్‌' పేరుకు అసలైన నేపథ్యం ఇదే...
ఆపరేషన్‌ సిందూర్‌తో పాక్‌ గగనతలంపై ప్రభావం
ఉగ్ర‌వాదాన్ని ప్ర‌పంచం సంహించ‌కూడ‌దు:  కేంద్ర‌మంత్రి
వామ్మో తాటి చెట్లకు ఇన్ని రకాల పేర్లున్నయా... | Palle Patalu | LG MEDIA | Sydulumama