ఐరాస భద్రతామండలిలో పాకిస్థాన్‌కు కఠిన ప్రశ్నలు
పహల్గాం దాడిపై ఉగ్రవాదులకే బాధ్యత
పహల్గాం ఉగ్రదాడి ఘటనపై పాకిస్థాన్‌పై ప్రపంచదేశాలు తీవ్రంగా స్పందించాయి. ఈ దాడికి సంబంధించి ఐక్యరాజ్యసమితి భద్రతామండలిలో సోమవారం న్యూయార్క్‌లో జరిగిన సమావేశంలో పాక్ వ్యవహారం పూర్తిగా ఎక్స్పోజ్ అయ్యింది. ఉగ్రదాడిని తప్పించుకునే ప్రయత్నంగా పాకిస్థాన్ కశ్మీర్ సమస్యను లేవనెత్తింది. అయితే భారత్ గట్టిగా స్పందించడంతో పాక్‌కు ఎదురుదెబ్బ తగిలింది. సభ్యదేశాలు పహల్గాం దాడిని ఖండిస్తూ, “ఈ దాడికి బాధ్యులు ఎవరు?” అని నేరుగా ప్రశ్నించాయి. పాక్ చేసిన ఆరోపణలు, భారత్ కుట్ర పన్ని తానే దాడి చేసుకుందన్న వాదనలను దేశాలు ఖండించాయి. ఉగ్రవాదులకు తగిన మద్దతు అందిస్తున్న పాక్‌ను వారు ప్రశ్నించారు. ప్రత్యేకంగా లష్కరే తోయిబా పాత్రపై ఆందోళన వ్యక్తం చేశారు.
క్షిపణి పరీక్షలపై ఆగ్రహం, ప్రకటనకు నిరాకరణ
ఈ సమావేశంలో పాకిస్థాన్ ఇటీవల నిర్వహించిన వరుస క్షిపణి పరీక్షలపై కూడా సభ్యదేశాలు ఆక్షేపం వ్యక్తం చేశాయి. ప్రాంతీయ స్థిరతకు ఇది ప్రమాదకరమని పేర్కొన్నారు. అణుబాంబు బెదిరింపులతో ఉద్రిక్తతలు పెంచే ప్రయత్నం చేస్తోందని పాక్‌పై తీవ్ర అభ్యంతరం వ్యక్తమైంది.
భారత వ్యతిరేక తీర్మానం తీసుకురావాలని పాక్ ఆశించినా, ఒక్క దేశమూ దానికి మద్దతు ఇవ్వలేదు. చివరకు సమావేశం ఎలాంటి తీర్మానం లేకుండానే ముగిసింది. ప్రకటన విడుదలకూ ఐరాస అంగీకరించకపోవడంతో పాక్‌కు మరో దెబ్బ తగిలింది. సభ్యదేశాలు భారత్‌కు వ్యతిరేకంగా పాకిస్థాన్ తీసుకుంటున్న చర్యలను సమర్థించలేనని స్పష్టం చేశాయి.
ద్వైపాక్షిక చర్చలే మార్గం: సభ్యదేశాల సూచన
ప్రాంతీయ సమస్యలను భారత్‌తో నేరుగా చర్చల ద్వారానే పరిష్కరించుకోవాలని, ఉద్రిక్తతలు పెంచే చర్యల్ని విరమించుకోవాలని సభ్యదేశాలు పాకిస్థాన్‌ను సూటిగా హెచ్చరించాయి.
Comment List