రంగారెడ్డి జిల్లా చరిత్ర తెలుసుకోవాలనుకుంటున్నారా...!

రంగారెడ్డి జిల్లా చరిత్ర తెలుసుకోవాలనుకుంటున్నారా...!

రంగారెడ్డి జిల్లా

తెలంగాణ రాష్ట్రంలోని 33 జిల్లాలలో ఒకటి

1978లో హైదరాబాదు జిల్లా నుంచి విడదీసి దీనిని ఏర్పాటుచేశారు.హైదరాబాదు జిల్లా చుట్టూ నలువైపుల రంగారెడ్డి జిల్లా ఆవరించి ఉంది. హైదరాబాదు నగరమే ఈ జిల్లాకు కూడా పరిపాలనా కేంద్రం. 2011 జనాభా లెక్కల ప్రకారం ఇది రాష్ట్రంలో అత్యధిక జనాభా కలిగిన జిల్లాగా నిలిచింది.ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా, తమిళనాడు గవర్నరుగా పనిచేసిన మర్రి చెన్నారెడ్డి, తెలంగాణ పితామహుడిగా పేరుగాంచి[2], ఉప ముఖ్యమంత్రిగా పనిచేసిన కొండా వెంకట రంగారెడ్డి, దేశంలోనే తొలి మహిళా హోంశాఖ మంత్రిగా పనిచేసిన సబితా ఇంద్రారెడ్డి, విమోచనోద్యమకారులు కాటం లక్ష్మీనారాయణ, వెదిరే రాంచంద్రారెడ్డి, గంగారాం ఆర్య, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఈ జిల్లాకు చెందినవారే. శ్రీరామునిచే ప్రతిష్ఠించబడిన[3] కీసర లింగేశ్వరాలయం, అనంతగిరి, చిలుకూరు బాలాజీ, కీసర లాంటి పుణ్యక్షేత్రాలు, షాబాద్ నాపరాతికి, సిమెంటు కర్మాగారాలకు ప్రఖ్యాతిగాంచిన జిల్లా.

ఈ జిల్లాలో 37 మండలాలు, 5 రెవెన్యూ డివిజన్లు, 2 లోకసభ నియోజకవర్గాలు ఉన్నాయి. గ్రేటర్ హైదరాబాదుకు చెందిన 150 డివిజన్లలో 48 డివిజన్లు రంగారెడ్డి జిల్లాకు చెందినవి. ఈ జిల్లాలో ప్రవహించే ప్రధాన నది మూసీ. దేశంలోనే పొడవైన 7వ నెంబరు జాతీయ రహదారి, 9వ నెంబరు జాతీయ రహదారి, హైదరాబాదు నుంచి కాజీపేట, గద్వాల, వాడి, బీబీనగర్ రైలుమార్గాలు, వికారాబాదు-పర్భని మార్గం జిల్లా గుండా వెళ్ళుచున్నాయి

Tags:

About The Author

Related Posts

Post Comment

Comment List

Latest News

‘ఆపరేషన్ సిందూర్’ విజయంపై ప్రముఖుల ప్రశంసలు ‘ఆపరేషన్ సిందూర్’ విజయంపై ప్రముఖుల ప్రశంసలు
పహల్గాంలో ఇటీవల జరిగిన ఉగ్రదాడికి దీటైన ప్రతిస్పందనగా భారత ప్రభుత్వం ‘ఆపరేషన్ సిందూర్’కు శ్రీకారం చుట్టింది. మంగళవారం అర్ధరాత్రి 1.44 గంటలకు భారత సైన్యం పాకిస్తాన్‌లోని ఉగ్రవాద...
ఐరాస భద్రతామండలిలో పాకిస్థాన్‌కు కఠిన ప్రశ్నలు
ఆఖరి బంతికి గెలిచిన గుజరాత్‌ టైటాన్స్‌
'ఆపరేషన్‌ సింధూర్‌' పేరుకు అసలైన నేపథ్యం ఇదే...
ఆపరేషన్‌ సిందూర్‌తో పాక్‌ గగనతలంపై ప్రభావం
ఉగ్ర‌వాదాన్ని ప్ర‌పంచం సంహించ‌కూడ‌దు:  కేంద్ర‌మంత్రి
వామ్మో తాటి చెట్లకు ఇన్ని రకాల పేర్లున్నయా... | Palle Patalu | LG MEDIA | Sydulumama